వెండితెర చందమామ కాజల్ అగర్వాల్.2007లో డ్రామా యాక్షన్ గా కల్యాణ్ రామ్ హీరోగా తేజా డైరక్షన్ లో తెరకెక్కిన లక్ష్మీ కల్యాణంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.లక్ష్మీ కల్యాణం తరువాత విడుదలైన చందమామలో మహా లక్ష్మీ క్యారక్టర్ తో మంచి మార్కులే కొట్టేసింది.అయితే 2009లో రాజమౌళి డైరక్ట్ చేసిన మగధీరా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన మిత్రవిందగా కోట్లాది మంది అభిమానుల్ని మెప్పించి తన యాక్టింగ్ స్ట్రెంత్ చూపించింది.
అలా టాలీవుడ్ కెరీర్ బిగినింగ్ లోనే మగధీరలో యువరాణి మిత్రవిందగా నటించి.టాలీవుడ్ యువరాణి అయిపోయిందీ భామ.టాలీవుడ్ లో మగధీర, ఆర్య2, డార్లింగ్, మిస్టర్ ఫర్ఫెక్ట్, బిజినెస్ మేన్, నాయక్, బాద్ షా,టెంపర్, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి ఇలా 30కి పైగా సినిమాల్లో అగ్రహీరోలతో చిందేసిన ఈ పంచదార మిస్ కాస్త మిసెస్ అయ్యింది.
ఈ వారంలోనే తన ప్రియుడు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లూను తెలుగు సాంప్రదాయం ప్రకారం తలపై జీలకర్ర, బెల్లంతో వివాహం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తెలుగు సాంప్రదాయం ప్రకారం వధవు, వరుడు జీలకర్ర బెల్లం పెట్టుకుంటే పెళ్లి అయిపోయినట్లే భావిస్తారు.
అందుకే ఆ సమయంలో ‘ధ్రువంతే రాజావరుణో ధ్రువందేవో బృహస్పతి అంటూ మంత్రాలను ఈ సందర్భంలో చదువుతారు.
కాజల్, గౌతమ్ పెళ్లి కూడా అలాగే జరిగింది.14 సంవత్సరాల పాటు టాలీవుడ్ లో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.తెలుగు సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మండపంలో జీలకర్ర బెల్లంతో పెళ్లి చేసుకున్న అనంతరం.
జీలకర్రబెల్లం అంటే సుఖ:దుఖాల్లో ఎప్పుడూ కలిసుండాలని అర్ధం చెబుతుంది అంటూ కొత్త అర్ధం చెప్పింది కాజల్.