టాలీవుడ్ అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న తన ప్రియుడు గౌతమ్ కిచ్లుతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.అతి కొద్దిమంది సమక్షంలో ముంబై తాజ్ హోటల్ లో అంగరంగ వైభవంగా కాజల్ అగర్వాల్ పెళ్లి జరిగింది.
అయితే పెళ్లి తర్వాత అతిథుల కోసం అదే హోటల్ లోనే పార్టీ ని అరేంజ్ చేసారు ఈ దంపతులు.ఈ సందర్భంగా రిసెప్షన్ లో తీసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
ఈ పార్టీలో కాజల్ అగర్వాల్ ప్రత్యేకంగా డిజైన్ చేయించిన మోడరన్ డ్రెస్ లో ఎంతో అందంగా కనిపించారు.గౌతమ్ కూడా సూట్ ధరించి ఈ పార్టీలో హడావిడి చేశారు.
ఈ పార్టీలోని అతిథులను ఉత్సాహ పరచడానికి సంగీత కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఓ మహిళ వైలెన్ ఎంతో అద్భుతంగా ప్లే చేయడంతో కొందరు డాన్స్ చేస్తూ పార్టీని ఎంజాయ్ చేశారు.
కరోనా నేపథ్యంలో అతికొద్ది మంది సమక్షంలో నిర్వహించిన కాజల్ అగర్వాల్ పెళ్లి కి ఇతర సెలబ్రిటీస్ రాకపోవడంతో, సినీ ప్రముఖులు, నెటిజన్లు కాజల్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.అనుష్క, తమన్నా, సమంత, మంచు లక్ష్మి, కీర్తి సురేష్, రకుల్ ప్రీత్, సోను సూద్, హన్సిక, ప్రియమణి, సుశాంత్, అనసూయ తదితరులు కాజల్ అగర్వాల్ కు జీవితంలో ఎంతో ఆనందంగా, ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో నిండాలని ఈ చందమామ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఒకే ఆలోచనతో రెండు హృదయాలు ఒక్కటి అవుతాయి.ప్రియమైన కాజల్, గౌతమ్ కు శుభాకాంక్షలు అని అనుష్క ఎంతో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
పెళ్లి తర్వాత కాజల్ సినిమాల్లో నటిస్తానని ఇదివరకే తెలిపారు.అయితే ప్రస్తుతం ఆమె నటించిన మోసగాళ్లు చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
మరో పక్క చిరంజీవితో కలిసి ఆచార్య లో నటించనున్నారు.ముంబయి సాగా, భారతీయుడు 2 చిత్రాలలో నటించనున్నారు.
అయితే బాలీవుడ్ చిత్రం క్వీన్ తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది.