Kabulasab : ఒక్క మార్కుతో ఫెయిల్.. ఇప్పుడు కోచింగ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. కబులాసాబ్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

పోటీ పరీక్షలు రాసిన సమయంలో ఒక మార్కుతో, అర మార్క్ తో జాబ్ రాకపోతే ఆ బాధ అంతాఇంతా కాదు.తెలంగాణ రాష్ట్రంలోని అమరవాయికి చెందిన కబులాసాబ్( Kabulasab ) బీఎడ్ పూర్తి చేసి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అనుకున్నారు.

 Kabulaa Saab Inspirational Succes Story Details Here Goes Viral In Social Media-TeluguStop.com

ఎలాంటి కోచింగ్ లేకుండా ప్రిపేర్ అయిన కబూలా సాబ్ లక్ష్యంపై దృష్టి పెట్టి సక్సెస్ దిశగా అడుగులు వేశారు.కష్టపడితే ఆలస్యంగా అయినా సక్సెస్ దక్కుతుందనే నమ్మకంతో ముందుకెళ్లారు.

తన సక్సెస్ స్టోరీ గురించి కబులాసాబ్ చెబుతూ 2012 సంవత్సరంలో డీఎస్సీ పరీక్ష ( DSC Exam ) రాసినా నేను క్వాలిఫై కాలేదని 2017 సంవత్సరంలో డీఎస్సీ, గురుకుల పరీక్షలు రాశానని తెలిపారు.కరోనా తర్వాత తెలుగు భాషను ఎంచుకున్నానని 2021 సంవత్సరంలో తెలుగులో సెట్, 2023 లో నెట్ లో క్వాలిఫై అయ్యానని కబూలాసాబ్ వెల్లడించడం గమనార్హం.2023 సంవత్సరం ఆగష్టు నెలలో టీజీటీ నోటిఫికేషన్ ( TGT Notification )వచ్చిందని కబూలాసాబ్ పేర్కొన్నారు.

Telugu Jl Demo, Kabulaa Saab, Kabulaasaab, Pgt Exam, Tgt-Inspirational Storys

ఈ ఉద్యోగం కోసం నేను ఏడాది పాటు చదివానని కబూలాసాబ్ కామెంట్లు చేయడం గమనార్హం.ఇతరుల సలహాలతో ముందుకెళ్తూ 12 పద్ధతిలో టీజీటీ జాబ్ తో పాటు జేఎల్ క్వాలిపై అయ్యానని కబూలాసాబ్ వెల్లడించారు.పీజీటీ పరీక్షలో ( PGT exam )నేను ఒక్క మార్క్ తో డిస్ క్వాలిఫై అయ్యానని ఆయన తెలిపారు.

ఆ సమయంలో నేను కొంత నిరుత్సాహానికి గురయ్యానని కబూలాసాబ్ వెల్లడించారు.

Telugu Jl Demo, Kabulaa Saab, Kabulaasaab, Pgt Exam, Tgt-Inspirational Storys

జేఎల్ డెమోలో( JL demo ) నేను మంచి ప్రతిభను కనబరిచానని తాజాగా రిలీజైన టీజీటీ రిజల్ట్స్ లో రాష్ట్ర స్థాయిలో 55వ ర్యాంక్ సాధించానని కబూలాసాబ్ పేర్కొన్నారు.కుటుంబ సభ్యుల సహాయసహకారాలతో కెరీర్ పరంగా సక్సెస్ అయ్యానని కబూలా సాబ్ వెల్లడించారు.కష్టపడితే సక్సెస్ సాగుతుందని నా సక్సెస్ తో ప్రూవ్ అయిందని ఆయన అన్నారు.

కబులా సాబ్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube