కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో (సీఎస్‌యూ)( California state University ) ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన సునీల్ కుమార్, ప్రవీణ్ సిన్హాలు .వర్సిటీపై తాము చేసిన ఫిర్యాదును కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ ఫెడరల్ కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.
సీఎస్‌యూ నూతనంగా సవరించిన వివక్ష రహిత విధానం, రక్షిత వర్గంగా కులంను వేరు చేసి.భారతీయ మూలాలు, హిందూ విశ్వాసం కలిగిన విద్యార్ధులు, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రవీణ్ సిన్హా సీఎస్‌యూ లాంగ్ బీచ్‌లో అకౌంటెన్సీ ప్రొఫెసర్‌గా, సునీల్ కుమార్ .సీఎస్‌యూ సిస్టమ్( CSU System ) కింద వచ్చే శాన్ డియాగో స్టేట్ యూనివర్సిటీ (ఎస్‌డీఎస్‌యూ)లోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

2022లో సీఎస్‌యూ తనను వివక్షత లేని విధానంలో కులాన్ని చేర్చిందని .దీనిని చాలా మంది అధ్యాపకులు తప్పుదారి పట్టించేదిగా పేర్కొన్నారు.యూనివర్సిటీ పాలసీని అమలు చేయకుండా నిరోధించేందుకు సీఎస్‌యూపై కుమార్ , సిన్హాలు గతేడాది అక్టోబర్‌లో కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టు( California Federal Court )లో ఫిర్యాదు చేశారు.ఏది ఏమైనప్పటికీ నవంబర్ 21న జిల్లా కోర్ట్ .అధికార పరిధి లోపించినందుకు ఫిర్యాదిదారుల డ్యూప్రాసెస్ క్లెయిమ్‌లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ రూలింగ్‌ను సవాల్ చేస్తూ గతవారం దాఖలు చేసిన వారి అప్పీల్ ఇప్పుడు కోర్టు ఆదేశాలను తిప్పికొట్టాలని కోరింది.

యూఎస్ ఆధారిత లాభాపేక్ష లేని హిందూ న్యాయవాద సమూహం హిందూ అమెరికన్ ఫౌండేషన్( Hindu American Foundation ) విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం అప్పీల్ మూడు కారణాలపై ఆధారపడింది.దీనిపై జాతీయ మీడియా సంస్థ ది ప్రింట్‌కు పంపిన ఈ మెయిల్‌లో కుమార్ , సిన్హాలు ఇలా అన్నారు.అప్పీలేట్ కోర్టు సరైన ప్రమాణాలను అర్ధం చేసుకుని, వర్తింపజేస్తుందని , సీఎస్‌యూ విధానం రాజ్యాంగ విరుద్ధమని తదుపరి విచారణ కోసం జిల్లా కోర్టుకు కేసును తిరిగి పంపుతుందని తాము విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు.వివక్షను నివారించడానికి ప్రస్తుత చట్టాన్ని అమలు చేయడం అవసరమని వారు తెలిపారు.







