K. Vishwanath: ఆ సినిమాని రిలీజ్ చేయలేక చేతులెత్తేసిన కె.విశ్వనాథ్.. అదొక పెద్ద షాక్..!

సాధారణంగా కె.విశ్వనాథ్( K.Vishwanath ) ఏదైనా సినిమాను మొదలుపెడితే కచ్చితంగా ఫినిష్ చేస్తారు.మూవీని మొదలుపెట్టే ముందే అన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటారాయన.

 K Viswananth Not Able To Release One Movie-TeluguStop.com

అలాంటిది ఒక సినిమాలో మాత్రం ఆయన ప్లాన్స్ తలకిందులు అయ్యాయి.దానివల్ల ఆ మూవీ రిలీజ్ కాలేదు.ఆ సినిమా పేరు సిరిమువ్వల సింహనాదం(Siri Muvvala Simhanadam ).1990లో ఈ సినిమా మొదలయ్యింది.1991లో విజయవాడ శకుంతల థియేటర్లలో దీనిని రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్లను కూడా వదిలారు.అయితే చెప్పిన సమయానికి థియేటర్‌కు సినిమా రియల్ బాక్సులు రాలేదు.

Telugu Viswananth, Vishwanath, Theaters, Sirimuvvala, Tollywood-Telugu Top Posts

ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కాలేదు( Not released in theaters ) కానీ కొంతమంది దీనిని ప్రత్యేకంగా షో వేసుకుని చూశారు.వారు చెప్పిన ప్రకారం ఈ మూవీలో స్టేజ్ మీద ఆడపిల్లలా నరసింహారావు నటిస్తాడు.బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి( Burra Subrahmanya Shastri ) లాగా డ్యాన్స్‌తోపాటు అద్భుతంగా నటిస్తుంటాడు.సమాజంలో అతనికి మంచి పేరు వస్తుంది కానీ ఆడపిల్ల లాగా కనిపించే భావను పెళ్లి చేసుకోనని అతడి మరదలు బెట్టు చేస్తుంది.

వేరేవాళ్లు ఆమెను పాడు చేస్తారు.దీని గురించి తెలుసుకొని బావగా కథానాయకుడు ఎంతో బాధపడతాడు.ఆపై దుష్ట శిక్షణ పూర్తి చేస్తాడు.ఆడ వేషాలు వేసి స్త్రీతత్వం గురించి ఇందులోని హీరో బాగా తెలుసుకుంటాడు.

వారి ఇబ్బందులను అందరి కంటే ఎక్కువగా తెలుసుకుంటాడు.మహిళ పక్షపాతిగా ఉంటాడు.

Telugu Viswananth, Vishwanath, Theaters, Sirimuvvala, Tollywood-Telugu Top Posts

అయితే ఈ సినిమాని రిలీజ్ చేయడం కోసం విశ్వనాద్ చాలా ప్రయత్నించాడు కానీ విఫలమయ్యాడు.ఎన్నిసార్లు రిలీజ్ చేయాలని చూసినా అనుకోని కారణాలు అడ్డంకి గా నిలిచాయి.చివరికి ఆయన మూవీని రిలీజ్ చేయలేనని చేతులెత్తేశారు.దానిని డిజిటల్ ఫార్మాట్ లోకి మార్చి యూట్యూబ్ లో రిలీజ్ చేయాలని కొందరు సలహా ఇచ్చారు కానీ అది కూడా కుదరలేదు.

తాను తీసిన సినిమాల్లో ఈ సినిమా రిలీజ్ కావడికోకపోవడం పట్ల తాను ఎప్పటికీ బాధపడతానని విశ్వనాథ్ ఒకానొక సమయంలో తెలిపాడు.ఈ మూవీలో డాన్సర్ పాత్రలో కళాకృష్ణ యాక్ట్ చేశారు.

ఇందులో రెండో హీరోగా చంద్రమోహన్ నటించాడు.దీని తర్వాత వీరిద్దరూ మళ్ళీ కలిసి సినిమా కోసం పని చేయలేదు.

కే.విశ్వనాధ్ తీసిన ఒక సినిమా రిలీజ్ కాలేదు అని తెలిసి అప్పట్లో చాలామంది షాక్ అయ్యారు.ఇప్పటికీ దీని గురించి తెలుసుకున్న చాలామంది నోరెళ్ల పెడుతుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube