టాలెంట్ ఉంటే చాలు.ఇండస్ట్రీలో రాణించడానికి.
ఈ మధ్య కాలంలో యంగ్ తరం టాలీవుడ్ లో అడుగు పెడుతూనే ఉంది.మరి మన టాలీవుడ్ లోకి మరో యంగ్ హీరో తన అదృష్టం పరీక్షించు కోవడానికి రాబోతున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నర్నె నితిన్ హీరోగా పరిచయం అవ్వబోతున్నారు.ఈ యంగ్ హీరో నటిస్తున్న మొట్టమొదటి మూవీ ”మ్యాడ్( MAD )”.
ఈ సినిమాను డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తెరకెక్కించగా యూత్ ఫుల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు.ఇక తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు.
మరి ఈ ట్రైలర్ ను ఎన్టీఆర్( Jr ntr ) చేతుల మీదుగా లాంచ్ చేసారు.ట్రైలర్ ఆద్యంతం అలరించే విధంగా ఉంది.ఈ ట్రైలర్ లో ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య జరిగే ఫన్ అండ్ కాలేజ్ సీక్వెన్స్ తో పాటు హిలేరియస్ కామెడీ కూడా ఆకట్టుకుంటుంది.
మరో సర్ప్రైజ్ ఏంటంటే ఈ ట్రైలర్ కట్ లో జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కూడా ఒక పాత్రలో కనిపించి ఆకట్టు కున్నారు.
ఈ ట్రైలర్ ఆద్యంతం కూడా ఎలాంటి యాక్షన్ లేకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంది.దీంతో కామెడీకి పెద్ద పీట వేసినట్టు అనిపిస్తుంది.భీమ్స్ సంగీతం కూడా ట్రైలర్ లో ఆద్యంతం ఆకట్టుకుంది.నితిన్ లుక్స్( Narne Nithiin ) అండ్ ఇతడి యాక్టింగ్ కూడా ఆడియెన్స్ ను అలరించే విధంగానే ఉంది.
మరి ట్రైలర్ తో అంచనాలు మరిన్ని పెంచుకున్న ఈ చిత్రం ఈ వీకెండ్ లో అక్టోబర్ 6న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించిన ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాల్సిందే.