2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అప్పుడే అమెరికాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఆశావహులంతా అధ్యక్ష బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు ఇప్పటికే తాము అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.వీరితో పాటు డెమొక్రాటిక్, రిపబ్లిక్ పార్టీలలో వున్న కొందరు ప్రముఖులు కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా.
ఇంకొందరు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు.రిపబ్లికన్ పార్టీలో కీలక నేతగా వున్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ కూడా అధ్యక్ష బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
వీరితో పాటు మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్, సౌత్ కరోలినా సెనేటర్ టిమ్ స్కాట్, మాజీ ఐక్యరాజ్యసమితి రాయబారి నిక్కీ హేలీ, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, ఇండో అమెరికన్ బిలియనీర్ వివేక్ రామస్వామిలు ఆ పార్టీ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి( America Presidential Elections )లో నిలిచిన వారు విరాళాలు సేకరించాలన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే అధికారికంగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన వారంతా విరాళాల సేకరణలో దూసుకెళ్తున్నారు.ట్రంప్, డిసాంటిస్ తదితరులు ఈ విషయంలో స్పీడు మీదున్నారు.
అధ్యక్షుడు జో బైడెన్ కూడా తన మద్ధతుదారులు, ప్రచార బృందం ద్వారా విరాళాలను సేకరిస్తున్నారు.అయితే ప్రస్తుతం హాలీవుడ్‌లో జరుగుతున్న నటీనటులు, రచయితల సమ్మె కారణంగా బైడెన్ లాస్ ఏంజెల్స్( Los Angeles )లో తన నిధుల సేకరణ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఎన్నికలకు 15 నెలలు మాత్రమే సమయం వుండటంతో .ఈ సమ్మె ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు.ఇది ఇలాగే కంటిన్యూ అయితే బైడెన్‌కు ఇబ్బందేనని విశ్లేషకులు అంటున్నారు.
నిజానికి బైడెన్ ( Joe Biden ).కార్మికుల హక్కులు, సంఘాలకు గట్టి మద్ధతుదారుగా వుంటారు.హాలీవుడ్‌లో నటీనటుల సమ్మె కూడా ఇందుకు మినహాయింపు కాదు.
వీరు న్యాయమైన ఒప్పందాన్ని పొందాలని తాను కోరుకుంటున్నట్లు బైడెన్ ఇప్పటికే పేర్కొన్నారు.అయితే లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాలు బైడెన్ నిధుల సేకరణ కార్యక్రమంలో ప్రముఖమైనవి.2020 ఎన్నికల సమయంలో బైడెన్ ఒక్క కాలిఫోర్నియాలోనే 105.5 మిలియన్ డాలర్లను సేకరించారు.ఇది అప్పట్లో ఆయన ప్రచారం కోసం సేకరించిన మొత్తం నిధుల్లో 21 శాతం.బైడెన్ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో లాస్ ఏంజెల్స్ కౌంటీ అత్యంత కీలకమైనదిగా చెప్పవచ్చు.2020లో జరిగిన 20 వర్చువల్ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్( Virtual Fundraising Events )లలో హాజరైన వారు తలకు 25,000 డాలర్లు చొప్పున చెల్లించారు.హాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్లు స్వతహాగా మిలియనీర్లు కావడంతో ఈ ప్రాంతంలో భారీగా విరాళాలు సేకరించవచ్చు.
కానీ ప్రస్తుతం సమ్మె కారణంగా ఇలాంటి కార్యక్రమాలకు బ్రేక్ పడింది.
సమ్మె కారణంగా ఇప్పటికే తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నటీనటులు, కార్మికుల పట్ల సానుభూతితో నిధుల సమీకరణను వాయిదా వేయాలని బైడెన్ నిర్ణయించారు.
పరిశ్రమ ఇబ్బందుల్లో వున్నప్పుడు హాలీవుడ్ కమ్యూనిటీ నుంచి నిధులను సేకరించడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అధ్యక్షుడు భావిస్తున్నారు.సమ్మె కారణంగా ప్రస్తుతం అనిశ్చితి ఏర్పడినప్పటికీ ఈ ఏడాది చివరి నాటికి హాలీవుడ్, లాస్ ఏంజెల్స్‌లో పరిస్థితులు చక్కబడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.