టీడీపీ-జనసేన పొత్తుపై మాజీ జేడీ లక్ష్మీ నారాయణ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల మధ్య పొత్తుపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

 Jd Lakshmi Narayana Sensational Comments On Janasena Tdp Alliance,jd Lakshmi Nar-TeluguStop.com

తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లుగా సమాచారం.అయితే పొత్తులకు ముందే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై పలు ఊహగానాలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎదురుచూస్తున్నారు.టీడీపీతో పొత్తుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదనీ, కూటమి సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్‌ను ప్రకటించాలనే షరతుతో పోత్తు ఉండాలని జనసేన పార్టీ కార్యకర్తలు బహిరంగా, సోషల్ మీడియాలో మెసేజ్‌లతో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని టీడీపీ అధినేత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, ముఖ్యమంత్రి హోదాలోనే మళ్లీ అసెంబ్లీకి వస్తానని తన ప్రతిజ్ఞనను నిలబెట్టెకోవాలని చూస్తున్నారు.

కాబట్టి పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తన శపథం నెరవేరకుండా పోతుందని, మళ్లీ అసెంబ్లీకి ప్రవేశించే అవకాశం ఉండదని చంద్రబాబు విశ్వసిస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన పార్టీ పొత్తుపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారయణ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.“పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానులు కోరుకుంటుండగా, నాయుడు ముఖ్యమంత్రిగా మాత్రమే తిరిగి అసెంబ్లీకి వస్తానని ప్రతిజ్ఞ చేశారు.

కూటమి అధికారంలోకి వస్తే నాయుడు సీఎం, పవన్ కల్యాణ్ డిప్యూటి సీఎంగా అయ్యే అవకాశం ఉంది’’ అని ఓ మీడియా ఛానెల్‌తో జరిగిన ఇంటరాక్షన్‌లో ఆయన జోస్యం చెప్పారు.

Telugu Ap, Chandranbabu, Jagan, Janasena, Jd Lakshmi Yana, Pawan Kalyan-Politics

ఈ సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా “అత్తారింటికి దారేది”లోని డైలాగ్‌ను కూడా అభిమానులు గుర్తుచేసుకున్నారు, నిజమైన నాయకుడుకి ఎక్కడ తగ్గలో తెలుసు మరియు ఎక్కడ గెలవాలో కూడా తెలుసని అంటున్నారు.సాధారణంగా మహాకూటమిలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ నుంచే ముఖ్యమంత్రి సహజంగానే ఉంటారు.అది సాధ్యం కాకపోతే కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో జరిగినట్లుగా నాయుడు, పవన్ ఇద్దరూ రెండున్నరేళ్ల పాటు అధికారాన్ని పంచుకోవచ్చు.

ఏ పార్టీకి ఎన్ని కేబినెట్‌ బెర్త్‌లు, ఏయే శాఖలు అనే విషయాలపై కూటమి పార్టీలు ఒక అవగాహనకు వస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube