మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచాయి.ఎవరికి వారు వ్యూహాత్మక ఎత్తుగడలతో మునుగోడులో తమ పార్టీ జెండాను ఎగురవేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో మునుగోడు ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ఏ మాత్రం తగ్గకుండా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ రచ్చ చేస్తున్నారు.ఈ ఎన్నికల్లో తానే గెలుస్తానని ప్రకటిస్తున్నారు.
రోజుకో కొత్త ఆరోపణలతో వార్తల్లో నిలుస్తున్నారు.అలాగే తన వేషాధారణతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు.
నిన్నటి ప్రచారంలో రైతుల గెటప్ వేసుకున్నారు కేఏ పాల్.భుజంపై కండువా పెట్టుకుని, చేతిలో కర్ర పెట్టుకుని రైతులతో ముచ్చటించారు.అలాగే పొలాల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు.తాజాగా మునుగోడు ఎన్నికల్లో తానే ఖచ్ఛితంగా గెలుస్తానని ప్రకటించారు.
ఈ ఎన్నికల్లో 30 నుంచి 50 వేల ఓట్ల మెజార్టీతో ప్రజా శాంతి పార్టీ గెలుస్తుందని, ప్రజల గుండెల్లో తానే ఉన్నట్లు చెప్పుకొచ్చారు.చౌటుప్పల్‌లోని లింగోజీగూడెంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.‘మునుగోడు ఎన్నికల్లో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు తనకు మద్దతుగా ఉన్నారు.
బీజేపీ ఓడిపోతుందని అర్థమైంది.అందుకే నా ప్రియ శిష్యుడు జేపీ నడ్డా కూడా మునుగోడులో సభను రద్దు చేసుకున్నాడు.ప్రధాన పార్టీలు తన గెలుపునే వారి గెలపుగా ప్రకటించాలి.కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి రెడ్డి నాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నా.అయితే టీఆర్ఎస్ ఈ మూడు నెలల్లో రూ.11,200 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం ఉంది.అంత ఖర్చు చేసే బదులు ఇందులో కేవలం రూ.100 కోట్లు ఖర్చు చేస్తే నియోజకవర్గమే అభివృద్ధి కదా.కేసీఆర్‌కు ఈ విషయం తెలియదా? అభివృద్ధి చేస్తే.ఇన్ని డబ్బులు పెట్టాల్సిన అవసరం లేకుండేది కదా.’ అని చెప్పుకొచ్చారు.