జమ్మూ కాశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలో విషాద ఘటన జరిగింది.రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టుపై శనివారం కొండచరియలు విరిగిపడ్డాయి.
ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు.మరో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.24 గంటలుగా చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్ పూర్తయినట్లు జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ డిప్యూటీ కమిషనర్ దేవాన్డ్ యాదవ్ తెలిపారు.క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు.