సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.రెండవ షెడ్యూల్ ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉండగా మహేష్ బాబు మాతృ మూర్తి ఇందిరా దేవి మృతి చెందిన కారణంగా రెండవ షెడ్యూల్ ఆలస్యం అయింది.
తల్లి మరణం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మహేష్ బాబు విదేశాల్లో ఫ్యామిలీ మెంబర్స్ తో హాలిడే లో ఉన్నారు.దాదాపు రెండు వారాల పాటు విదేశీ యాత్ర లో ఉన్న మహేష్ బాబు తాజాగా హైదరాబాద్ చేరుకున్నట్లుగా సమాచారం అందుతుంది.
హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఒక యాడ్ షూట్ లో మహేష్ బాబు పాల్గొంటాడు.ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా కు సంబంధించిన రెండవ షెడ్యూల్ కి రెడీ అవ్వబోతున్నాడు.

నవంబర్ మొదటి వారం లోనే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కార్యక్రమాలకు మహేష్ బాబు హాజరు కాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది.మహేష్ బాబు కు జోడి గా ఈ సినిమా లో స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే.అంతే కాకుండా ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ నటుడు ఇంకా కన్నడ స్టార్ నటుడు కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది.మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానులు దాదాపు పుష్కర కాలంగా ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతున్న నేపథ్యం లో అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.త్రివిక్రమ్ గత చిత్రం ఆల వైకుంఠపురంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
కనుక ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుంది అనే నమ్మకమును మహేష్ బాబు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.ఇక మహేష్ బాబు తదుపరి సినిమా రాజమౌళి తో చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే.







