కృష్ణాష్టమిని పురస్కరించుకొని పాన్ ఇండియా వ్యాప్తంగా షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా( Jawan Movie ) విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే.ఇప్పటికే మీడియా, సోషల్ మీడియా ఆహ, ఓహో అంటూ రాసిన వార్తలను చూస్తున్నాం.
అసలు ఈ సినిమా చేయడానికి ముందు షారుక్ ఖాన్ అట్లీ( Director Atlee ) తో ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ కావాలని చెప్పాడట.దాంతో మన ఆరవ తెలివి తేటలు మొత్తం చూపించి కథ ఎలాంటి లాజిక్ లేకుండా అచ్చం మన తెలుగు సినిమా లాగానే రెడీ చేసాడు అట్లీ.
ఇక ఇందులో హీరోయిన్ తమిళే, డైరెక్టర్ తమిళే, విలన్ తమిళే, సంగీత దర్శకుడు తమిళే.కేవలం పాన్ ఇండియా( Pan India ) కాబట్టి మరి ముఖ్యంగా హిందీ హీరో అని తెలియాలి మంచి యాక్షన్ ఎపిసోడ్స్ రాసి షారుక్ ని జొప్పించారు అంతే.
ఇంతకు మించి ఏమి లేదు.కేవలం షారుక్( Shah Rukh Khan ) అడిగాడు కాబట్టి అతడిని హీరోగా పెట్టారు కానీ ఆ సినిమా పక్క తమిళ వాసన కొడుతూ ఆరవ ఆముదం తాగినట్టే ఉంది.ఏది ఏమైనా కాస్త జనాలకు నచ్చుతుంది.అందులో ఎలాంటి సందేహం లేదు.పైగా పఠాన్ సినిమా లాగ కాకి లెక్కలు కూడా చూపించే పని లేకుండా కలెక్షన్స్ కూడా బాగానే వచ్చే అవకాశం ఉంది.అసలే సినిమాలు లేకుండా ప్రేక్షకులు ఒక పక్క చచ్చిపోతుంటే ఎడారిలో ఒయాసిస్ లా ఇప్పుడు జవాన్ వచ్చి పడింది.
కొంత లో కొంత తెలుగు వారికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి( Miss Shetty Mister Polishetty ) కూడా బాగానే నచ్చింది.
ఇలా సౌత్ కథలు, సౌత్ దర్శకులను నమ్ముకొని ఆ మధ్య సల్మాన్ మరియు అమీర్ కూడా సినిమాలు తీసి బొక్క బోర్లా పడ్డారు కానీ షారుక్ మాత్రం గట్టెక్కుతాడు.పైగా ఈ ఖాన్స్ అందరికి మన పైన పడటం ఈ మధ్య కొత్త ఫ్యాషన్ అయిపొయింది.వారి భాషలో దర్శకులకు ఎదో కరువు వచ్చినట్టు అందరు పొలోమని ఇక్కడే ల్యాండ్ అవుతున్నారు.
చూడాలి ఈ సంబడం ఎన్ని రోజులు కొనసాగుతుందో.అస్సలు జవాన్ సినిమా చూడటం కన్నా భగ్యరాజ్ అప్పట్లో తీసిన ఖైదీ వేట చాల బెటర్.
ఎందుకంటే జవాన్ సినిమా పూర్తిగా ఖైదీ వేట ను కాపీ కొట్టినట్టే ఉంటుంది మరి.