జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ కామెంట్స్.ఒక్క రాత్రిలో రాష్ట్ర రాజకీయ చర్చలు మారిపోయాయి.
ప్రజల్లో ఎవరికి ఓటు వెయ్యలో తెలియక అయోమయంలో ఉన్నారు.బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి సీఎంగా పవన్ కళ్యాణ్ ను ప్రకటించాలి.
బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా రేపు ఎల్లుండి రెండు రోజులు ఏపీలో పర్యటిస్తున్నారు.రాష్ట్ర స్థాయి కాదు ఢిల్లీ స్థాయి వ్యక్తులు ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కల్యాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి.
దీన్ని డిమాండ్ లేదా మా అబ్యర్ధన అయినా అనుకోవచ్జు.ప్రజల్లో చాలా మందికి అర్థం కావడం లేదు ఎవరికి ఓటు వెయ్యలో.
ఈ రెండు రోజల పర్యటనలో నడ్డా ఎపి ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి.నాడు 2014 ఎపి ప్రచారంలో భాగంగా మోడీ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ను పువ్వులో పెట్టి చూసుకుంటారో లేక చెవులో పువ్వులే పెడతారో మీ ఇష్టం.
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, పెద్ది రెడ్డి సపోర్ట్ లేకుండా గెలిచి ఆ తరువాత మా నాయకుడి గురించి మాట్లాడాలి.
ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపు లేటి హరి ప్రసాద్ కామెంట్స్.
రాష్ట్రం పూర్తిగా అంధకారంలో వెళ్ళిపోయింది.జనసేన పార్టీ అధ్యక్షుడికి పదవి కాదు ఎపి అబివృద్ది ముఖ్యం.
నాడు సీనియర్ నాయకుడికి అవకాశం ఇచ్చాం.అటు తరువాత ఒక్క అవకాశం ఇవ్వండి అని వచ్చిన నాయకుడు జగన్ కు అవకాశం ఇచ్చారు.
జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ళ పరిపాలనలో ప్రజలు చాలా అవస్థలు పడ్డారు.రాష్ట్ర జిల్లా కమిటీ బిజెపి నడ్డాకు విన్నపం ఒక్కటే పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి.
బిజెపిలో సీఎం స్థాయి వ్యక్తులు లేరని వాళ్ళకే తెలుసు.నేటి రాష్ట్ర రాజకీయాల పట్ల ప్రజల్లో అయోమయ పరిస్థితి నెలకొంది.
ఈ పరిస్థితులను గమనించి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవస్య కథ ఎంతైనా ఉంది.