విశాఖలో జనసేన-బీజేపీ పాగా వేస్తుందా!

ఇప్పుడు క్యాపిటల్ గా మారబోతున్న గ్రేటర్ విశాఖ మీద పట్టు సాధించాలని అధికార పార్టీ వైసీపీ ఇప్పటికి వ్యూహాలని సిద్ధం చేసుకుంది.మరో వైపు టీడీపీ గ్రేటర్ స్థాయిలో బలంగా ఉన్న కూడా విశాఖని క్యాపిటల్ రాజధానిగా చేయడం వ్యతిరేకించడం వలన ఆ పార్టీకి కొంత ప్రతికూలంగా మారింది.

 Janasena Bjp Advantage To Grater Visakha Elections-TeluguStop.com

తాజాగా చంద్రబాబు విశాఖ వెళ్ళినపుడు కూడా వైసీపీ, ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.అలా అని అధికార పార్టీకి విశాఖ ప్రజలు పట్టం కట్టేసే అవకాశాలు కూడా కనిపించడం లేదు.

ప్రశాంతంగా ఉన్న విశాఖని రాజకీయాలకి వేదికగా మార్చి అశాంతిని పెంచుతున్నారని విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.ఇది కొంత వైసీపీకి ప్రతికూలంగా కనిపిస్తుంది.

ఈ నేపధ్యంలో విశాఖలో బీజేపీ-జనసేన కూటమి కూడా సత్తా చూపిస్తుందా అంటే ఆ అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.గ్రేటర్ విశాఖ అంటే కొంత జనసేన క్యాడర్ బలంగా ఉన్న ప్రాంతం.

దాంతో పాటు బీజేపీ ఓటింగ్ పెరగడానికి మోడీని అభిమానించే నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు.అలాగే విశాఖ ప్రజలలో పవన్ కళ్యాణ్ పట్ల సానుకూల వైఖరి ఎక్కువగా ఉంది.

ఈ నేపధ్యంలో గ్రేటర్ విశాఖ ఎన్నికలలో ప్రచారం నిర్వహించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.అదే జరిగితే కొంత జనసేన పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతుంది.ఈ నేపధ్యంలో గ్రేటర్ విశాఖ మీద ఆధిపత్యం కోసం చూస్తున్న మూడు పార్టీలకి అక్కడ అవకాశం ఉంది.జనసేన-బీజేపీ విశాఖలో పాగా వేస్తే మాత్రం అది కచ్చితంగా రానున్న ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది.

ఈ నేపధ్యంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ విశాఖ ఎన్నికలకి సంబంధించి వ్యూహ రచన సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube