బీజేపీకి జనసేన గండం ?

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ( Bjp )ఒంటరిగా పోటీ చేస్తుందని, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని గతంలో బీజేపీ నేతలు గట్టిగా చెబుతూ వచ్చారు.తీర ఎన్నికల సమయానికి జనసేన పార్టీతో( Janasena Party ) పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి.

 Jana Sena For Bjp, Janasena Party , Bjp, Pawan Kalyan , Kishan Reddy , Nadendla-TeluguStop.com

మొదట తెలంగాణ ఎన్నికలను లైట్ తీసుకున్న జనసేన ఇప్పుడు గట్టిగా ఫోకస్ చేయడానికి కారణం బీజేపీనే అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.జనసేన పార్టీ ఎన్డీయేలో భాగమైన సంగతి తెలిసిందే.

Telugu Ap, Bandi Sanjay, Janasena, Kishan Reddy, Pawan Kalyan, Ts-Politics

అందువల్ల తెలంగాణలో కూడా జనసేన పోటీ చేయాలని, బీజేపీకి మద్దతుగా నిలవాలని కమలం పార్టీ అగ్రనేతలు పవన్ ను కోరినట్లు జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఇటీవల చెప్పుకొచ్చారు.దీంతో పవన్ ఇమేజ్ ను తెలంగాణలో కూడా బీజేపీ వాడుకునేందుకు ప్రయత్నిస్తోందని చెప్పకతప్పదు.అయితే జనసేనతో దోస్తీ వల్ల బీజేపీకి నష్టమే తప్పా లాభం లేదనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.ఎందుకంటే పార్టీకి తెలంగాణలో ప్రాంతీయ ప్రదాన్యత లేదు.అందువల్ల జనసేన పార్టీ యొక్క గ్లాస్ గుర్తును ఈసీ తొలగించింది.అందువల్ల పార్టీ తరుపున బరిలో నిలిచే అభ్యర్థులు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాల్సిన పరిస్థితి.

Telugu Ap, Bandi Sanjay, Janasena, Kishan Reddy, Pawan Kalyan, Ts-Politics

ప్రస్తుతం బీజేపీ ఎనిమిది సీట్లను జనసేన ( Jana sena )పార్టీకి కేటాయించింది.ఈ ఎనిమిది సీట్ల విషయంలో జంసేన గుర్తు లేకపోతే ఓట్ల విషయంలో చీలిక ఏర్పడుతుందనే భయం కమలం పార్టీ నేతలను వెంటాడుతోందట.అంతే కాకుండా జనసేన ప్రత్యేక్షంగానే 32 స్థానాల్లో బరిలో దిగబోతుందని పవన్ గతంలోనే ప్రకటించారు.కానీ బీజేపీతో కుదుర్చుకున్న ఎనిమిది సీట్ల కారణంగా జనసేన పోటీ చేసే స్థానాల విషయంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు.

ఒకవేళ జనసేన పార్టీ తరుపున గ్లాస్ గుర్తు లేకపోతే ఆ ఓటు శాతం ఎటువైపు మల్లుతుందనేది అంచనా వేయలేని పరిస్థితి.మొత్తానికి జనసేన పార్టీని నమ్ముకొని బీజేపీ చిక్కుల్లో పడిందనేది కొందరు చెబుతున్నా మాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube