వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని జురెక్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్‌..

దావోస్‌: వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ దావోస్‌ చేరుకుంటున్నారు.

 Jagan Arrives At Zurich Airport In Switzerland To Attend The World Economic Forum Conference Details, Jagan , Zurich Airport ,switzerland ,world Economic Forum Conference, Davos, Cm Jagan Mohan Reddy, Gudivada Amarnath, Mithun Reddy-TeluguStop.com

స్విట్జర్లాండ్‌లోని జురెక్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన రోడ్డు మార్గంలో దావోస్‌ ప్రయాణమయ్యారు.మరికాసేపట్లో ఆయన దావోస్‌ చేరుకుంటారు.

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సీఎంకు స్వాగతం పలికారు.

 Jagan Arrives At Zurich Airport In Switzerland To Attend The World Economic Forum Conference Details, Jagan , Zurich Airport ,Switzerland ,World Economic Forum Conference, Davos, Cm Jagan Mohan Reddy, Gudivada Amarnath, Mithun Reddy-వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని జురెక్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్‌..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యమంత్రి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఆరోఖ్యరాజ్‌ సీఎంకు సాదర స్వాగతం పలికారు.

స్విట్జర్లాండ్‌లో భారత ఎంబసీ రెండో కార్యదర్శి రాజీవ్‌కుమార్, ఎంబసీలో మరొక రెండవ కార్యదర్శి బిజు జోసెఫ్‌ తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.స్విట్జర్లాండ్‌లో ఉంటున్న తెలుగువారు కూడా సీఎంకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube