పార్టీ కోసమే ప్రభుత్వామా.. జగన్ ఫిలాసఫీ ?

సాధారణంగా ప్రభుత్వం పార్టీ వేర్వేరుగా ఉంటాయి.పార్టీ గెలిచి ప్రభుత్వం స్థాపించినప్పటికి ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుంది.

 Is The Government Only For The Party.. Jagan's Philosophy , Ys Jagan Mohan Reddy-TeluguStop.com

పార్టీ అధికారం కోసం ఆరాటపడుతుంది.అయితే ఈ రెండు భిన్న దృవలను వైఎస్ జగన్ ఏకం చేస్తున్నారా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్న వైఎస్ జగన్( YS Jagan Mohan Reddy ) ఆ దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న వ్యూహాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే మారుతున్నాయి.

Telugu Ap, Chandra Babu, Gadapagadapa, Jana Sena, Pawan Kalyan, Ap Jagan, Ysjaga

తాజాగా జగన్ సర్కార్ ” వై ఏపీ నీడ్స్ జగన్( Why AP Need Jagan )అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.అయితే ఈ కార్యక్రమం ప్రభుత్వానిదా ? లేదా పార్టీకి సంబంధించినదా అనేది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు విశ్లేషకులు.ఈ కార్యక్రమం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి సి‌ఎం గా ఎందుకు ఉండాలో తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఈలాంటి కార్యక్రమాలన్నీ పార్టీకి సంబంధించినవే అయినప్పటికి ప్రభుత్వ అధికారులను పాల్గొనేలా చేయడం ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైందనే విమర్శ గట్టిగా వినిపిస్తోంది.అధికారులచేత ఇంటింటి ప్రచారం చేయిస్తూ వారి వెనుక వైసీపీ లీడర్లు, కార్యకర్తలు ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Telugu Ap, Chandra Babu, Gadapagadapa, Jana Sena, Pawan Kalyan, Ap Jagan, Ysjaga

అలాగే గడప గడపకు మన ప్రభుత్వం పేరిట కూడా వేల కోట్ల ప్రజాధనాన్ని జగన్ వృధా చేశారనే విమర్శ గత కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది.ఇప్పుడు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని కూడా తనకు అనుకూలంగా జగన్ చేస్తుండడంతో.వైసీపీ పాలనలో పార్టీ, ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు విశ్లేషకులు.

అయితే ప్రజాభివృద్ది కోసం కలిసి పని చేయడంలో తప్పులేదని అలా కాకుండా ప్రజాధనాన్ని వృదా చేసేందుకు కలిసి పని చేస్తే అది ముమ్మాటికి తప్పేనని చెబుతున్నారు కొందరు.ఏది ఏమైనప్పటికి ప్రభుత్వాన్ని కూడా పార్టీ కార్యకలాపాల్లో ఉపయోగించుకోవడం ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైందని విమర్శలు గుప్పిస్తున్నారు కొందరు అతివాదులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube