మోడీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలే ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు దారి తీస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా వరకు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసింది.
ప్రస్తుతం కేంద్రం కన్ను టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌పై పడింది.ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్ కష్టాల వెనుకా కేంద్రం నిర్లక్ష్యమే కనిపిస్తోంది.అయితే గతంలో ప్రధాని మోడీ ఒక ఆరోపణ చేశారు.‘వ్యాపార రంగ సంస్థలను నడపడం ప్రభుత్వం పని కాదు.’ అని 2014లో జరిగిన భారత్-అమెరికా బిజినెస్ కౌన్సిల్ సమావేశంలో ఇలా చెప్పారు.గతంలో పెట్టుబడుల ఉపసంహరణ పేరిత అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలోని ఒక కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమాన్ని మోడీ ప్రభుత్వం మరింత వేగం పెంచింది.దీని కోసం మోడీ సర్కార్ ప్రత్యేక మంత్రిత్వ శాఖనే నియమించింది.ఈ మంత్రిత్వ శాఖ ముఖ్య లక్ష్యం.ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌పరం చేయడానికి ప్రణాళిక బద్ధమైన కుట్రలు చేయడం.2021-22 వార్షిక బడ్జెట్‌లో మోడీ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా రూ.1.75 లక్షల కోట్లు సమీకరించుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది.ఈ క్రమంలో లాభాల్లో నడుస్తున్న కంపెనీలను కూడా ప్రైవేట్ వారి చేతుల్లో పెడుతోందని ప్రతిపక్షాలు, సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులూ ఆరోపిస్తున్నారు.

బీఎస్ఎన్ఎల్‌ను కూడా ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం పక్కా ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది.గతంలో బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ పేరిట రూ.70 వేల కోట్లు ప్రకటించింది.ఇందులో రూ.30 వేల కోట్లు ఉద్యోగుల పదవీ విరమణ పథకాలకు కేటాయించింది.దీంతో మొదటి రోజే రెండు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థల నుంచి 92 వేల మంది ఉద్యోగులు రిటైర్మెంట్ చేశారు.
ప్రైవేటుపరం చేయడానికి ఉద్యోగులను సంఖ్యను తగ్గిస్తూ.పని నాణ్యత సేవలను కూడా నియంత్రించింది.దీంతో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థల మార్కెటింగ్ పడిపోయింది.మరోవైపు ప్రైవేట్ రంగ టెలికాం సంస్థల ఫిర్యాదుల మేరకు నాన్ టెలికాం ఆదాయంపై పన్ను వెసులుబాటు కల్పించింది.
బీఎస్ఎన్‌ఎల్ పట్ల పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.