టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఇండియన్ సినీ ప్రేమికుల కోసం ఆస్కార్ అవార్డును తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.చాలా సంవత్సరాల తర్వాత ఆస్కార్ కు ఇండియన్ సినిమా పాట నామినేట్ అయ్యింది.
నాటు నాటు పాట తో ప్రపంచ వ్యాప్తంగా కుమ్మేస్తున్న రాజమౌళి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్నాడు.ఈనెల లోనే ఆస్కార్ అవార్డుల వేడుక వైభవంగా జరుగబోతుంది.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.ఈసమయంలోనే రాజమౌళి టీమ్ మొత్తం అమెరికాలో సందడి చేస్తోంది.
ఎన్టీఆర్ కూడా నేడు అమెరికా వెళ్లాడు.రామ్ చరణ్.
ఎన్టీఆర్.రాజమౌళి టీమ్ అంతా కూడా అమెరికా లో సందడి చేయబోతున్నారు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలో కుటుంబ సమేతంగా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈసారి కూడా పెద్ద ఎత్తున ఆర్ ఆర్ ఆర్ యూనిట్ సభ్యులు సందడి చేసేందుకు అమెరికా వెళ్లారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆస్కార్ అకాడమీ నుండి నాటు నాటు పాటకు అవార్డు ఖాయం అనే సమాచారం ఉండటం వల్లే యూనిట్ సభ్యులు అంతా కూడా అమెరికా వెళ్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది.మొత్తానికి దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా రాజమౌళి టీమ్ వైపు చూస్తున్నారు.
ఆస్కార్ అవార్డు తో రాజమౌళి టీమ్ ఇండియా లో అడుగు పెడితే ఆకాశమే హద్దు అన్నట్లుగా ఘనమైన సత్కారం మరియు ఘన స్వాగతం లభించడం ఖాయం.
అమెరికాకు చెందిన కొన్ని మీడియా సంస్థలు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు అవార్డు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నట్లుగా చెబుతున్నారు.కనుక అది ఎంత వరకు సాధ్యం అనేది చూడాలి.రాజమౌళి టీమ్ భారీగా ఖర్చు చేసి అక్కడ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
ఈ మధ్య కాలంలో ఏ ఇండియన్ సినిమాకు దక్కని గౌరవం ఆర్ఆర్ఆర్ కు దక్కింది.కనుక ఆ ఒక్క ఆస్కార్ కూడా సాధ్యం అయ్యే అకవాశాలు కనిపిస్తున్నాయి.