రాహుల్ ఏపీ నుంచి పోటీ చేస్తున్నారా ?

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఇటీవల కాలంలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు.వరుసగా ఒక్కో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు వెలువడుతూ ఉండడంతో, రాబోయే లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించారు.

 Is Rahul Gandhi Contesting From Ap , Rahul Gandi, Sonia Gandi, Ap Congress, Tel-TeluguStop.com

ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో రాహుల్ ఉన్నారు.అందుకే ముందుగా బలహీనంగా ఉన్న రాష్ట్రాల పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఇటీవల కర్ణాటక, తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం దక్కించుకోవడంతో ,ఏపీ పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఇక్కడ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా రాహుల్ పావులు కలుపుతున్నారు.

ఇటీవల వైస్ షర్మిలను పార్టీలో చేర్చుకున్నారు.ఆమెకు ఏపీ కాంగ్రెస్ ఏపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించే అవకాశం కనిపిస్తోంది.

దీంతో పాటు పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా కాంగ్రెస్ ప్లాన్ చేసుకుంటోంది.

Telugu Ap Congress, Ap, Janasena, Rahul Gandi, Rahulgandi, Sonia Gandi, Visakha

ఇది ఇలా ఉంటే.రాహుల్ గాంధీ ఏపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా కాంగ్రెస్ లోని కొంతమంది కీలక నాయకులు చెబుతున్నారు.ఏపీలో తాను పోటీ చేస్తే ఆ ప్రభావం రాష్ట్రమంతా ఉంటుందని, కాంగ్రెస్ విజయవకాశాలు మెరుగుపడతాయని రాహుల్ అంచనా వేస్తున్నారట.

ఈ మేరకు ఆయన విశాఖ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం .కాంగ్రెస్ విశాఖ స్టీల్ ప్లాంట్( vizag steel plant ) విషయంలో పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయని అంచనా వేస్తున్నారట.రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ ( Uttar Pradesh )లోని అమేధీ సొంత నియోజకవర్గం నుంచి ఎప్పుడు పోటీ చేస్తారు.గత ఎన్నికల్లో అమేధీ తో పాటు పాటు కేరళలోని వయా నాడ్ నియోజకవర్గ నుంచి పోటీ చేశారు.

కానీ ఒకచోట మాత్రమే గెలిచారు.దీంతో ఈసారి విశాఖ నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారట.

Telugu Ap Congress, Ap, Janasena, Rahul Gandi, Rahulgandi, Sonia Gandi, Visakha

విశాఖ అయితే సేఫ్ జోన్ గా ఉంటుందని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కూడా కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట.దీంతో ఈ నియోజకవర్గం నుంచి రాహుల్ పోటీకి దిగితే విజయవకాశాలు అవకాశాలు ఎలా ఉంటాయి? ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఎంతవరకు ఉంటుంది అనే విషయంపై సర్వేలు కూడా చేయిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube