ఏపీలో టీడీపీ జనసేన, బీజేపీ ( TDP Janasena BJP )మద్య పొత్తు వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ హాట్ చర్చలకు దారి తీస్తూనే ఉంది.టీడీపీ జనసేన అధికారికంగా పొత్తుకు సై అనగా అలాగే జనసేన బీజేపీ( Janasena BJP ) మద్య కూడా దోస్తీ వ్యవహారం కొనసాగుతూ వస్తోంది.
ఇక తెలంగాణ విషయానికొస్తే ఈ మూడు పార్టీలు కూడా ఎన్నికల బరిలో ఉన్నాయి.తెలంగాణలో టీడీపీ జనసేన పార్టీల ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికి బీజేపీ మాత్రం రేస్ లో ఉంది.
ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో కలిసే అవకాశం ఉందా అనే చర్చ గత కొన్నాళ్లుగా సాగుతోంది.ముఖ్యంగా బీజేపీ జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉందని, జనసేన కోసం 12 స్థానాలను సిద్దంగా ఉంచిందని ఇలా రకరకలుగా వార్తలు వస్తున్నాయి.

అయితే అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ బీజేపీ మొదటి జాబితాలో అసలు జనసేన ప్రస్తావనే లేదు.దీంతో ఈ రెండు పార్టీల మద్య పొత్తు లేనట్లే అనే అభిప్రాయానికి వచ్చారంతా.అయితే దసరా తరువాత రెండో జాబితాను ప్రకటించనున్న బీజేపీ.రెండో లిస్ట్ లో జనసేనకు కేటాయించే సీట్లు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ఎన్నికల్లో జనసేన 32 స్థానాల్లో పోటీ చేయనుందని ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.కాగా బీజేపీకి అధికారిక మిత్రా పక్షంగా ఉంటూ జనసేన ఎన్డీయేలో ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తే మేలనే ఆలోచనలో రెండు పార్టీలు ఉన్నాయట.

అయితే తాము ఎవరితో పొత్తు పెట్టుకోబోమని తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని మొదటి నుంచి రాష్ట్ర కమలనాథులు చెబుతూ వస్తున్నారు.ఇప్పుడు సడన్ గా జనసేనతో కలిసి నడిస్తే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం ఉందనే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారట.ఒకవైపు అధికార బిఆర్‌ఎస్( BRS ) మరియు కాంగ్రెస్ పార్టీలు( Congress parties ) అధికారం కోసం గట్టిగా పోటీ పడుతున్నాయి.
బీజేపీ కూడా రేస్ లో ఉన్నప్పటికి ఆ రెండు పార్టీలకు వచ్చినంతా మైలేజ్ బీజేపీకి రావడం లేదు.అందుకే ప్రజల దృష్టి పార్టీపై పడాలంటే జనసేనను కలుపుకోవడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట బీజేపీ నేతలు.
మరి జనసేన బీజేపీ మద్య పొత్తు కుదురుతుందా లేదా అనేది తెలియాలంటే బీజేపీ( BJP ) విడుదల చేసే రెండో జాబితా వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.