కే‌సి‌ఆర్ కు' రిజల్ట్స్ ' టెన్షన్ !

తెలంగాణలో హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని కే‌సి‌ఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు.బి‌ఆర్‌ఎస్ నేతలు కూడా తమదే విజయమని గట్టిగా చెబుతున్నారు.

 Is Kcr Afraid Of Election ,   Cm Kcr , Brs  Party,  Congress Party  ,prashant Ki-TeluguStop.com

అయితే క్షేత్రస్థాయి నుంచి వస్తున్న రిపోర్ట్స్ మాత్రం కే‌సి‌ఆర్ ను కొంత కలవర పెడుతున్నట్లే తెలుస్తోంది.గత తొమ్మిదేళ్ల పాలన చూసిన రాష్ట్ర ప్రజలు మార్పువైపు అడుగులు వేస్తున్నాట్లు ఇప్పటికే వెలువడిన చాలా సర్వేలు చెబుతున్నాయి.

గత ఆర్నెళ్ల ముందు బి‌ఆర్‌ఎస్ కు అనుకూలంగా ఉన్న సర్వేలు.ఎన్నికలు దగ్గరపడే కొద్ది తారుమారు అవుతున్నాయి.

అనూహ్యంగా కాంగ్రెస్ వైపు ప్రజామద్దతు పెరుగుతున్నట్లు సర్వేలు తేల్చి చెబుతున్నాయి.

Telugu Brs, Cm Kcr, Congress-Politics

ఇటీవల వెలువడిన సి ఓటర్ సర్వే కూడా కాంగ్రెస్( Congress ) కె పట్టం కట్టింది.దీంతో ఈసారి ఎన్నికల్లో మార్పు ఖాయమేనా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.అయితే బి‌ఆర్‌ఎస్ పై ప్రజాభిప్రాయం మారుతుందనే సంగతి కే‌సి‌ఆర్ ముందుగానే గ్రహించినట్లు తెలుస్తోంది.

బి‌ఆర్‌ఎస్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో గతంలో కొన్నాళ్లు కే‌సి‌ఆర్ కలిసి పని చేసిన సంగతి విధితమే.అయితే ప్రశాంత్ కిషోర్ తో ఉన్న టైమ్ లోనే రాష్ట్రంలో ఐప్యాక్ నిర్వహించిన సర్వేలో బి‌ఆర్‌ఎస్ కు ప్రతికూల ఫలితలే వచ్చినట్లు టాక్.

అందుకే ఆ డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునేందుకే ప్రస్తుతం ఎన్నికల ముందు కే‌సి‌ఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Brs, Cm Kcr, Congress-Politics

బి‌ఆర్‌ఎస్ ఓడిపోతే ప్రజలే నష్టపోతారని, కాంగ్రెస్ కు అధికారం ఇచ్చి మోసపోవద్దని.ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు.కే‌సి‌ఆర్ ప్రతి ప్రసంగంలోనూ ఆత్మవిశ్వాసం కొరత స్పష్టంగా కనిపిస్తుందనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.పైపైకి 100కు పైగా సీట్లు సొంతం చేసుకుంటామని కే‌సి‌ఆర్ చెబుతున్నప్పటికి లోలోపల ఓటమి భయం ఆయనను వెంటాడుతున్నాట్లు తెలుస్తోంది.ఈసారి ఎన్నికల ఫలితాలను గతంలో మాదిరి ముందుగానే అంచనా వేయలేకపోవడం కూడా ఒక కారణం.

మొత్తానికి ఈసారి కే‌సి‌ఆర్ ( CM kcr )అంచనాలకు అందని రీతిలో ప్రజానాడీ ఉందని అందుకే డిసెంబర్ 3న వెలువడే ఫలితాలపై గులాబీ బాస్ లో టెన్షన్ మొదలైందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.మరి ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube