Kavitha : నేడు సుప్రీంకోర్టు లో కవిత భర్త పిటిషన్ .. ఈడి విచారణ కి డుమ్మా ? 

ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడి) అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను( Mlc Kavitha ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసులో ఆమెను ఈడి అధికారులు నిన్న ఆదివారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను అధికారులు విచారించారు.

 Is Kavitas Husbands Petition In The Supreme Court Open For Ed Hearing Today-TeluguStop.com

విచారణలో ఈడి అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం .ఈ విచారణ ను మొత్తం అధికారులు వీడియో రికార్డ్ చేయించినట్లు తెలుస్తోంది.విచారణ తరువాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్, హరీష్ రావు, కవిత భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావు కవితను కలిశారు.అధికారులు అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానాలు ఇచ్చారు.

తనపై వచ్చిన ఆరోపణలన్నీ ఆరోపణలుగానే మిగిలిపోతాయని , విచారణ లో అధికారులకు కవిత చెప్పినట్లు సమాచారం.

Telugu Hareesh Rao, Kavitashusbands, Kavitha, Kavitha Anil, Mlc Kavitha-Telugu P

ఈరోజు కవిత ను సమీప బంధువులు , ఆమె వ్యక్తిగత సిబ్బంది కొందరు కలవబోతున్నారు .ఈ వ్యవహారం ఇలా ఉంటే మరోవైపు కవిత భర్త అనిల్( Anil ) కు ఈడి అధికారులు నోటీసులు జారీ చేశారు .అనిల్ తో పాటు కవిత పిఆర్ఓ రాజేష్, ముగ్గురు అసిస్టెంట్లకు నోటీసులు ఇచ్చారు.ఈరోజు ఈడీ విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.అయితే ఈ విచారణకు కవిత భర్త అనిల్ హాజరవుతారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు.దీనికి కారణం కవిత అరెస్టు ను సవాల్ చేస్తూ ఆమె భర్త సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు ( Supreme Court )చేయనున్నారు.

Telugu Hareesh Rao, Kavitashusbands, Kavitha, Kavitha Anil, Mlc Kavitha-Telugu P

ఈడి కవితను అక్రమంగా అరెస్టు చేసిందని , ఇది సుప్రీం కోర్ట్ ఆదేశాలకు విరుద్ధమని అనిల్ కోర్టును ఆశ్రయించబోతున్నట్లు సమాచారం.ఈనెల 19 న కవితపై కేసు విచారణ జరగనుందని,  ఆమెను ఈడి అధికారులు అక్రమంగా అరెస్టు చేశారని గతంలో సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులకు ఇది విరుద్ధమని అనిల్ సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఈడీ విచారణకు అనిల్ హాజరవ్వడం పై క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube