కిలో ఉప్పు రూ.30 వేలు.. ఎందుకో తెలిస్తే షాక్

ఉప్పు ధర చాలా తక్కువగా ఉంటుంది.కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది.

 Interesting Facts About Bamboo Salt,bamboo Salt,bamboo Salt Price,costly Salt,ba-TeluguStop.com

కాకపోతే ఉప్పు ధర చాలా తక్కువే ఉంటుంది.కేజీ ఉప్పు రూ.30 వరకు ఉంటుంది.అయితే కేజీ ఉప్పు రూ.30 వేలు ఏంటని అనుకుంటున్నారా.అవును మీరు విన్నది నిజమే.ఈ ఉప్పు ధర కేజీ రూ.30 వేలు.కేజీ ఉప్పు కొనడానికి మీ నెల శాలరీ సరిపోతుంది.ప్రపంచంలోనే అతి ఖరీదైన ఉప్పు ఇదే.సాధారణ ఉప్పు కేజీ రూ.30, ఇక హిమాలయాస్ పింక్ సాల్ట్ కేజీ రూ.200 వరకు ఉంటుంది.

అయితే ఏకంగా కేజీ రూ.30 వేలు ఉండే ఈ ఉప్పు స్పెషాలిటీ ఏంటనుకుంటున్నారా.ఈ ఉప్పు పేరు బాంబూ సాల్ట్.

తెలుగులో బొంగులో ఉప్పు అంటారు.ప్రతి ఏటా ఇంకా దీని ధర ఇంకా పెరుగుతూనే ఉంటుంది.

దీనిని పర్పుల్ సాల్ట్ అని కూడా పిలుస్తారు.బొంగులో చికెన్ లాగే.

బొంగులో ఉప్పుగా దీనిని అభివర్ణిస్తారు.కొరియన్లు దీనిని ఎక్కువగా వాడుతూ ఉంటారు.

ఇక మెడిసిన్స్ తయారీలో కూడా దీనిని వాడతారు.ఈ ఉప్పులో ఔషధ గుణాలు బాగా ఎక్కువగా ఉంటాయి.

అందుకే దీని ధర ఎక్కువ.

సముద్రపు నీటి నుంచి సేకరించిన ఉప్పును వెదురు బొంగుల్లో ఉంచుటారు.

ఉప్పు నింపిన తర్వాత బొంగు రెండువైపులను బంకమన్నుతో మూసివేస్తారు.తర్వాత మంటల్లో వేసి 800 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 14 గంటల పాటు కాలుస్తారు.

Telugu Bamboo Salt, Bamboosalt, Salt, Immunity, Latest-Latest News - Telugu

బొంగు నుంచి వచ్చే నూనె, రసాలతో ఉప్పు కలిసిపోవడం వల్ల వాటి పోషకాలు ఉప్పుకు పడతాయి.ఆ తర్వాత ముద్దగా తయారు అయిన లోపలి ఉప్పును క్లీన్ చేసి పొడిలా చేస్తారు.మళ్లీ దాన్ని వేరే బొంగులోకి చేర్చి మళ్లీ కాలుస్తారు.

ఇలా అనేకసార్లు కాల్చడం వల్ల ఉప్పు రంగు మారుతుంది.

మళ్లీ దానిని పొడిలా చేసి బాంబూ సాల్ట్ పేరుతో అమ్ముతారు.ఈ ఉప్పును తయారు చేయడానికి 40 నుంచి 45 రోజులు పడుతుంది.

ఈ ఉప్పులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని, ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube