ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావుకు( Akkineni Nageswararao ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.ఏఎన్నార్ మరణించి సంవత్సరాలు గడుస్తున్నా అభిమానులు మాత్రం ఇప్పటికీ ఆయనను గుర్తు చేసుకుంటున్నారు.
క్లాస్ సినిమాలతో ఏఎన్నార్ ట్రెండ్ సృష్టించారు.అప్పట్లో చాలామంది స్టైల్ విషయంలో ఏఎన్నార్ ను ఫాలో అయ్యేవారు.
పౌరాణిక చిత్రం ద్వారా ఏఎన్నార్ కెరీర్ మొదలు కాగా జానపద హీరోగా ఆయన సినిమాలలో నటించారు.అయితే ఏఎన్నార్ సాంఘిక చిత్రాలకు సరిపోరని ప్రచారం జరిగింది.
ఆ సమయంలో 1950 సంవత్సరంలో సంసారం అనే సినిమాలో ( Samsaram )నటించే ఛాన్స్ ఏఎన్నార్ కు దక్కింది.జానపదాల నటుడు షర్టూ, ప్యాంట్ వేసుకుని కనిపించే పాత్రలో నటించడమేంటని కొంతమంది కామెంట్లు చేయగా ఏఎన్నార్ దృష్టికి ఆ కామెంట్లు రావడంతో పారితోషికం తగ్గించుకుని మరీ ఈ సినిమాలో నటించడం జరిగింది
ఈ సినిమాలోని కల నిజమాయేగా సాంగ్ కోసం ఏఎన్నార్ నలుచదురం కళ్లద్దాలను ధరించి కనిపించారు.ఏఎన్నార్ ధరించిన కళ్లద్దాలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి.సంసారం సినిమా సక్సెస్ సాధించగా ఈ కళ్లజోడు సృష్టించిన ట్రెండ్ మామూలు ట్రెండ్ కాదు.
మయో ఆప్టికల్స్ నుంచి అప్పట్లో ఏకంగా 5000 కంటే ఎక్కువగా ఏఎన్నార్ ధరించిన కళ్లజోడు లాంటి కళ్లజోళ్లు అమ్ముడయ్యాయంటే వీటికి ఎంత క్రేజ్ ఏర్పడిందో తెలుస్తుంది.
ఏఎన్నార్ చివరి సినిమా మనం( Manam ) కాగా ఈ జనరేషన్ ఫ్యాన్స్ కు సైతం ఈ సినిమా ఎంతో నచ్చింది.అక్కినేని అభిమానులు ఈ సినిమా గురించి చాలా సందర్భాల్లో ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు.నాగచైతన్య సైతం ఒక సందర్భంలో తను నటించిన సినిమాలలో ఈ సినిమా అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు.
అక్కినేని హీరోలకు ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ దక్కడం లేదు.భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో అక్కినేని హీరోలకు ఆ లోటు తీరాలని అభిమానులు కోరుకుంటున్నారు.