భార్యను దారుణంగా హత్య చేసిన కేసులో భారత సంతతికి చెందిన వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ అమెరికాలోని ఫ్లోరిడా( Florida in America ) కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.2020లో తన భార్య నర్సుగా పనిచేస్తున్న ఆసుపత్రి పార్కింగ్ ప్లేస్‌లోనే ఆమెను నిందితుడు దారుణంగా హతమార్చాడు.బాధితురాలి ఒంటిపై దాదాపు 17 కత్తి పోట్లు వున్నట్లు బ్రోవార్డ్ హెల్త్ కోరల్ స్ప్రింగ్స్ ( Broward Health Coral Springs )పేర్కొంది.మీడియా నివేదికల ప్రకారం గత శుక్రవారం ఈ కేసు విచారణ జరిగింది.
నిజానికి ఈ కేసులో నిందితుడు ఫిలిప్ మాథ్యూకి మరణశిక్ష పడాల్సింది.అయితే అప్పీల్ కారణంగా శిక్షను జీవిత ఖైదుగా మార్చారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .ఫిలిప్ మాథ్యూ ( Philip Mathew )తన కారుతో భార్య మెరిన్ జాయ్( Marine Joy ) కారును అడ్డుకున్నాడు.ఆపై కత్తితో విచక్షణారహితంగా ఆమెను పొడిచాడు.రక్తమోడుతున్న భార్య శరీరం మీదుగా కారును నడిపాడు.జాయ్ సహోద్యోగుల్లో ఒకరు మాట్లాడుతూ .తాము ఆమెకు సాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు.చనిపోవడానికి కొద్దిక్షణాల ముందు తనపై దాడి చేసింది తన భర్తేనని చెప్పింది.జీవిత ఖైదు ఖాయమైనందున ప్రతివాది అప్పీలు చేసుకునే హక్కును వదులుకుంటున్నందున అతని మరణశిక్షను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ అటార్నీ కార్యాలయం ప్రతినిధి పౌలా మెక్‌మాన్ తెలిపారు.
న్యాయస్థానం తీర్పుపై జాయ్ బంధువు ఓబీ ఫిలిప్( Obi Philip ) మాట్లాడుతూ.ఆమె తల్లి ఇప్పుడు సంతోషంగా వుంటుందని వ్యాఖ్యానించారు.

ఇకపోతే.భార్యను దారుణంగా చంపిన సిక్కు సంతతి వ్యక్తికి యూకే కోర్టు 15 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ ఇటీవల సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.ఈ ఏడాది మేలో తూర్పు లండన్‌లోని తమ ఇంట్లోనే నిందితుడు భార్యను బ్యాట్‌తో కొట్టి చంపాడు.నిందితుడిని 79 ఏళ్ల తర్సమే సింగ్‌గా గుర్తించారు.ఇతను తన భార్య మాయాదేవి (77)ని చంపినట్లు నేరాన్ని అంగీకరించడంతో బుధవారం స్నారెస్ బ్రూక్ క్రౌన్ కోర్టు శిక్ష విధిస్తూ తుది తీర్పు వెలువరించింది.సింగ్ పదవీ విరమణ చేయడానికి ముందు ఏళ్ల తరబడి తన ఇంటికి సమీపంలోని రైన్‌హామ్‌లో భార్యతో పాటు పోస్టాఫీసును నడిపాడు.
సింగ్ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.వీరు భారతదేశం నుంచి యూకేకు సుమారు 50 ఏళ్ల క్రితం వలస వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.