ప్రేయసిని పదే పదే భయాభ్రాంతులకు గురిచేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన భారత సంతతికి చెందిన మలేషియా వ్యక్తికి కోర్టు బుధవారం 7 నెలల మూడు వారాల జైలు శిక్ష విధించింది.నిందితుడిని పార్తిబన్ మణియంగా గుర్తించారు.ఇతనిని మార్చి 12న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టుడే వార్తాపత్రిక కథనాన్ని ప్రచురించింది.30 ఏళ్ల నిందితుడు నేరపూరిత బెదిరింపు, అల్లర్లు చేయడం, భాగస్వామికి హాని కలిగించడం వంటి రెండు ఆరోపణలపై నేరాన్ని అంగీకరించాడు.ఈ నేరానికి పాల్పడిన సమయంలో పార్తిబన్ మద్యం మత్తులో వున్నాడు.
పార్తిబన్ తన 38 ఏళ్ల సహోద్యోగితో సుమారు రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు డేటింగ్ చేస్తున్నాడని కోర్టుకు తెలియజేశారు.
బాధితురాలు ఆమె మామతో కలిసి సింగపూర్‌లో నివసిస్తోంది.అయితే పార్తిబన్‌తో ఈ ఏడాది మార్చిలో తన బంధాన్ని ముగించింది. జనవరి 23న పార్తిబన్ తన స్నేహితులతో కలిసి మద్యం సేవించడానికి బయటకు వెళ్లాడు.ఈ సమయంలో ఫోన్ చేసి బాధితురాలితో గొడవపడ్డాడు.
ఇంటికి వచ్చి రాగానే ఆమె మరో వ్యక్తితో కలిసి వుందంటూ అసభ్యపదజాలంతో దూషించాడు.
ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆమె మేనమామ వారిని అతను నివసించే హౌసింగ్ బ్లాక్‌కు తీసుకెళ్లాడు.
ఆ సమయంలో పార్తిబన్ తన స్నేహితురాలిని చెంపదెబ్బ కొట్టాడు.ఆయన ఎంత వారించినప్పటికీ నిందితుడు పట్టించుకోలేదు.
అక్కడితో ఆగకుండా కత్తిని ఆమె గొంతుపై వుంచి చంపేస్తానని బెదిరించాడు.ఆపై చెక్కతో తలపై మోదాడు.
దీంతో బాధితురాలు కూడా తీవ్రంగా ప్రతిఘటించింది.దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితురాలి మామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
దాదాపు నెల తర్వాత ఫిబ్రవరి 28న పార్తిబన్ .బాధితురాలి ఫ్లాట్ వద్దకు వెళ్లాడు.అయితే ఆమె అతనిని లోపలికి అనుమతించకపోవడంతో మెయిన్ డోర్‌కి వున్న మెటల్ గేట్‌ను బలవంతంగా తీసివేశాడు.
ఆ తర్వాత ఫ్లాట్‌లోకి వెళ్లి బాధితురాలి ఫోన్ లాక్కొని ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు.అంతేకాకుండా కత్తి తీసుకుని ఈసారి ఎట్టిపరిస్ధితుల్లోనూ నిన్ను చంపేస్తానంటూ బెదిరించాడు.బాధితురాలిని కొట్టడంతో పాటు ఆమె మలేషియా పాస్‌పోర్ట్‌ను చించివేశాడు.ఎలాగోలా పార్తిబన్‌ను కూల్ చేసిన ఆమె గ్రౌండ్ ఫ్లోర్‌కు చేరుకుని , పోలీసులను పిలవాల్సిందిగా ఓ బాటసారిని కోరింది.
దీంతో మరోసారి పార్తిబన్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు బెయిల్‌పై విడుదల చేశారు.
తిరిగి మార్చి 11న మరోసారి బాధితురాలితో గొడవకు దిగిన నిందితుడు.తన బట్టలు తనకు తిరిగి ఇవ్వాలని వాదించాడు.తనతో పాటు ఓ చోటుకి రావాలని పిలిచి ఓ బెంచ్‌పై కూర్చోబెట్టాడు.
అక్కడ మద్యం బాటిల్‌ను పగులగొట్టి బాధితురాలి మెడపై పెట్టాడు.నిన్ను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు.
సరిగ్గా అదే సమయంలో ఓ పెట్రోలింగ్ వాహనం అటుగా రావడంతో బాధితురాలు కేకలు వేసింది.దీంతో పార్తిబన్‌ను మరోసారి అరెస్ట్ చేశారు పోలీసులు.
కోర్టులో విచారణ సందర్భంగా నిందితుడికి 10 నెలల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోర్ట్ దృష్టికి తీసుకెళ్లింది.ఉద్దేశపూర్వకంగా గాయపరిచినందుకు అతనికి మూడేళ్ల జైలు శిక్ష లేదా 5000 సింగపూర్ డాలర్ల జరిమానా లేదా రెండు విధించవచ్చు.
అలాగే దురుసు ప్రవర్తనకు గాను రెండు వారాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.