కరోనా మహమ్మారి సమయంలో కీలక పాత్ర పోషించి, సింగపూర్ వాసులకు సహాయం చేసినందుకు గాను 26 ఏళ్ల భారత సంతతి వైద్యురాలికి బాండ్ ఫ్రీ లీ క్వాన్ యూ స్కాలర్‌షిప్ దక్కింది.డాక్టర్ ఎం ప్రేమిఖా తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ అధ్యయనాల కోసం రెండేళ్ల వరకు 50,000 సింగపూర్ డాలర్ల భత్యం పొందుతారు.
ఈ నెలాఖరులో యునైటెడ్ స్టేట్స్‌లోని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీలో ఆమె ఏడాది పాటు పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్‌ను అభ్యసించనున్నారు.
జూలై 2021 నుంచి ఈ ఏడాది జనవరి వరకు డాక్టర్ ప్రేమిఖా.
ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేసింది.ఈ సందర్భంగా వివిధ వ్యాక్సిన్ తయారీదారులతో పలు ఒప్పందాలపై చర్చలు జరిపారు.
అలాగే తన కోవిడ్ వ్యాక్సిన్‌లకు సంబంధించి గ్లోబల్ యాక్సెస్ (కోవాక్స్) ప్రోగ్రామ్ ద్వారా టీకాలను పొందేందుకు గాను అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి అయిన గవితో కలిసి పనిచేసింది.దీనితో పాటు పొరుగు దేశాలకు వ్యాక్సిన్‌లను అందించేందుకు గాను సింగపూర్ విదేశాంగ మంత్రిత్వ శాఖతో డాక్టర్ ప్రేమిఖా సమన్వయంతో పనిచేశారు.
సింగపూర్ వ్యవస్థాపక ప్రధాన మంత్రిని స్మరించుకునేందుకు గాను 1991లో టాంజాంగ్ పగర్ సిటిజన్స్ కన్సల్టేటివ్ కమిటీని స్థాపించారు.అత్యుత్తమ సింగపూర్ వాసులకు పోస్ట్‌గ్రాడ్యుయేట్ అధ్యయనాలను కొనసాగించడంలో సహాయపడటానికి లీ కువాన్ యూ స్కాలర్‌షిప్‌ను ప్రారంభించారు.ఈ స్కాలర్‌కు ఎంపికైన డాక్టర్ ప్రేమిఖాకు గురువారం దీనికి సంబంధించిన చెక్‌ను అందజేశారు.ఈమెతో పాటు డాక్టర్ హైరిల్ రిజాల్ అబ్దుల్లా (42), మాథ్యూ లీ మున్‌హాంగ్ (32)లు కూడా ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు.
వీరిద్దరూ 2014 నుంచి పబ్లిక్ సర్వీస్‌లో వుంటూ దేశ ప్రజలకు సేవలందిస్తున్నారు.