మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులను ఇండియన్ బ్యాంక్ వేలం వేయనున్నట్లు తెలుస్తుంది.గతంలో ప్రత్యూష కంపెనీ రూ.248 కోట్ల మేర ఇండియన్ బ్యాంక్‌లో రుణం తీసుకుంది.ఈ నేపథ్యంలో బ్యాంకు కు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించాలి అంటూ ఆ బ్యాంకు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడం తో గతంలో ఆ కంపెనీ డైరెక్టర్ గా పనిచేసిన గంటా మరియు పలువురు సభ్యుల ఆస్తులను వేలం వేయనున్నట్లు తెలుస్తుంది.2006 అక్టోబర్ 4న రుణం చెల్లించాలంటూ మొదటి సారి బ్యాంక్ నోటీసులు జారీ చేసింది.ఎలాంటి స్పందన లేకపోవడంతో 2017 ఫిబ్రవరి 21న ప్రత్యూష కంపెనీ కుదువ పెట్టిన ఆస్తులను ఇండియన్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంది.
హైదరాబాద్ బ్రాంచ్ ఇండియన్ బ్యాంక్ ఈ వేలం వేస్తున్నట్లు ప్రకటించగా, గంటా శ్రీనివాసరావుతో పాటు అతనితో భాగస్వాములుగా ఉన్నటు వంటి ప్రత్యూష కంపెనీకి చెందిన పలువురు సభ్యుల ఆస్తులను వేలం వేయనుంది.రుణం ఎగవేత వ్యవహారంలో ఆయన కంపెనీకి చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది.
నవంబరు 25 న ఈ వేలం ప్రక్రియను నిర్వహిస్తామని తెలిపింది.ఈ మేరకు ఇ–ఆక్షన్ సేల్ నోటీసును హైదరాబాద్‌లోని ఇండియన్ బ్యాంకు సామ్(SAM) బ్రాంచ్ జారీ చేసింది.
ఇండియన్ బ్యాంక్ నుంచి గంటా కూతురి పేరున ఉన్న కంపెనీ కొన్నేళ్ల క్రితం లోన్ తీసుకుంది.దానికి సంబంధించి రూ.141.68 మేర బ్యాంకుకు బకాయి పడడం తో2016, అక్టోబరు 4న మొదటిసారి ప్రత్యూష కంపెనీకి ఇండియన్ బ్యాంకు నోటీసులు పంపించింది.
కానీ రుణం చెల్లించలేక ఆ కంపెనీ చేతులెత్తేయడం తో ఇన్నళ్ల పాటు చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి ఆ రుణం విలువ రూ.248 కోట్లకు చేరింది.ఈ నేపథ్యంలో రుణం కోసం కుదువ పెట్టిన ప్రత్యూష గ్రూప్ ఆస్తులను వేలం వేయాలని ఇండియన్ బ్యాంక్ నిర్ణయించడం తో గంటా కు చెందిన విశాఖలోని కీలకమైన ప్రాంతాలలో ఉన్న భవనాలు, రుషికొండ వద్ద ఉన్న స్థలాలు స్వాధీనం చేసుకోనున్నట్లు తెలుస్తుంది.