‘‘ మిస్ ఇండియా యూఎస్ఏ ’’గా రిజుల్ మైని , కాబోయే డాక్టర్‌ని వరించిన కిరీటం

‘‘మిస్ ఇండియా యూఎస్ఏ 2023’’గా( Miss India USA 2023 ) ఇండో అమెరికన్ యువతి రిజుల్ మైని( Rijul Maini ) నిలిచారు.న్యూజెర్సీలో జరిగిన ఫైనల్‌లో 25 రాష్ట్రాల నుంచి 57 మంది పోటీపడగా.రిజుల్‌ను ఈ అందాల కిరీటం వరించింది.24 ఏళ్ల రిజుల్ మైని అమెరికాలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.సర్జన్ కావాలనేది తన లక్ష్యమని, పాఠశాల విద్య నుంచి చదువుకు ప్రాధాన్యత ఇచ్చేదానినని రిజుల్ తెలిపారు.కళలు, సాంస్కృతిక సంబంధిత కార్యక్రమాలకు తన జీవితంలో అంతే భాగం వుందని ఆమె వెల్లడించారు.

 Indian-american Medical Student Rijul Maini Crowned Miss India Usa 2023 Details,-TeluguStop.com

మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో( Michigan State University ) హ్యుమన్ సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన రిజుల్‌కు పెయింటింగ్, కుకింగ్, గోల్ఫింగ్‌లు అంటే ఇష్టం.స్వచ్ఛంద కార్యక్రమాలలోనూ ఈమె ముందుంటుంది, వైద్యానికి సంబంధించిన కొత్త విషయాలు, పుస్తకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ వుంటారు రిజుల్.

మిస్ ఇండియా యూఎస్ఏ 2023 టైటిల్‌ను గెలుచుకోవడం తనకు సంతోషంగా వుందని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సహకారం వల్లే ఇది సాధ్యమైందని రిజుల్ తెలిపారు.వర్జీనియాకు చెందిన గ్రీష్మా భట్( Greeshma Bhat ) ఫస్ట్ రన్నరప్‌గా, నార్త్ కరోలినాకు చెందిన ఇషితా పైరాయ్కర్( Ishita Pai Raikar ) సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.

ఇదే కార్యక్రమంలో మసాచుసెట్స్‌కు చెందిన స్నేహ నంబియార్‌ను మిసెస్ ఇండియా యూఎస్‌ఏగా ప్రకటించగా.పెన్సిల్వేనియాకు చెందిన సలోని రామ్మోహన్‌( Saloni Rammohan ) మిస్ టీన్ ఇండియా యూఎస్ఏ టైటిల్‌ను గెలుచుకున్నారు.

ఈ మూడు కేటగిరీల విజేతలు తదుపరి జరిగే ‘‘మిస్, మిసెస్, టీన్ ఇండియా వరల్డ్ వైడ్’’ పోటీల్లో పాల్గొనడానికి కాంప్లిమెంటరీ ఎయిర్ టికెట్‌లను పొందుతారు.

Telugu Arya Walvekar, Greeshma Bhat, Indian American, Medical, Michigan, India U

మిస్ ఇండియా యూఎస్ పోటీలు ప్రారంభించి 41 ఏళ్లు నిండాయి.ఇది భారత్‌కు వెలుపల ఎక్కువ కాలం నడుస్తోన్న , భారతీయులే నిర్వహిస్తున్న పోటీ.దీనిని న్యూయార్క్‌కు చెందిన భారత సంతతికి చెందిన ధర్మాత్మ, నీలం శరణ్‌లు వరల్డ్ వైడ్ పేజెంట్స్ బ్యానర్‌పై ప్రారంభించారు.

దీనిపై ధర్మాత్మ మాట్లాడుతూ.సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా వున్న భారతీయ కమ్యూనిటీ( Indian Community ) మద్ధతుతోనే ఈ కార్యక్రమం విజయవంతంగా నడుస్తోందన్నారు.

Telugu Arya Walvekar, Greeshma Bhat, Indian American, Medical, Michigan, India U

ఇకపోతే .గతేడాది ఆర్య వాల్వేకర్ (18)( Arya Walvekar ) మిస్ ఇండియా యూఎస్ఏ 2022 కిరీటాన్ని గెలుచుకున్నారు.ఈమె స్వస్థలం వర్జీనియా రాష్ట్రం.ఇక ఇదే పోటీలలో యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో రెండో సంవత్సరం ప్రీ మెడికల్ విద్యార్ధిని సౌమ్య శర్మ ఫస్ట్ రన్నరప్‌గా, న్యూజెర్సీకి చెందిన సంజన చేకూరి సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube