భారత్- జపాన్‌లు సహజ భాగస్వాములు : టోక్యోలోని ఇండియన్ కమ్యూనిటీతో మోడీ

భారత్- జపాన్ సహజ భాగస్వాములున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.క్వాడ్ దేశాధినేతల సమావేశంలో పాల్గొనేందుకు టోక్యో వెళ్లిన ఆయనకు అక్కడి ఇండియన్ కమ్యూనిటీ నుంచి ఘనస్వాగతం లభించింది.ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.భారత అభివృద్ది ప్రయాణంలో జపాన్ పెట్టుబడులు ముఖ్యమైన పాత్ర పోషించాయని పేర్కొన్నారు.ఇరు దేశాల మధ్య ఆధ్యాత్మికంగా, పరస్పర సహకార పరంగా మంచి సంబంధాలు వున్నాయని మోడీ చెప్పారు.బుద్ధ భగవానుడు చూపిన మార్గంలో నేటీ ప్రపంచం నడవాల్సిన అవసరం వుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 India-japan Are 'natural Partners', Pm Modi Tells Indian Community In Tokyo India, Japan , Indian Community, Tokyo ,newotani Hotel , Indains, Pm Modi, Quad , Made In India, Vacinations, Covid-TeluguStop.com

హింస, తీవ్రవాదం, అరాచకం, వాతావరణ మార్పులు వంటి నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల నుంచి మానవాళిని కాపాడేందుకు ఇదే మార్గమని ప్రధాని సూచించారు.

ఎంత పెద్ద సమస్యలు అయినా భారతదేశం ఎల్లప్పుడూ పరిష్కారాన్ని కనగొంటుందని మోడీ గుర్తుచేశారు.

 India-Japan Are 'natural Partners', PM Modi Tells Indian Community In Tokyo India, Japan , Indian Community, Tokyo ,Newotani Hotel , Indains, PM Modi, Quad , Made In India, Vacinations, Covid-భారత్- జపాన్‌లు సహజ భాగస్వాములు : టోక్యోలోని ఇండియన్ కమ్యూనిటీతో మోడీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా విపత్కర కాలంలో అనిశ్చిత పరిస్ధితులు వుండేవని, అయితే ఆ స్థితిలో కూడా భారత్ తన కోట్లాది మంది పౌరులకు ‘మేడ్ ఇన్ ఇండియా’ వ్యాక్సిన్‌లను సరఫరా చేసిందని .అలాగే 100కు పైగా దేశాలకు పంపిందని ప్రధాని మోడీ చెప్పారు.తాను ఎప్పుడు జపాన్ పర్యటనకు వచ్చినా మీ ఆప్యాయతకు సాక్షిగా వుంటానని ఆయన వ్యాఖ్యానించారు.మీలో చాలా మంది ఏళ్ల క్రితమే జపాన్‌లో స్థిరపడటంతో పాటు జపనీస్ సంస్కృతిని అలవరచుకున్నారని ప్రధాని ప్రశంసించారు.

అయినప్పటికీ భారతీయ సంస్కృతి, భాష పట్ల అంకితభావం నిరంతరాయంగా పెరుగుతోందన్నారు.

అంతకుముందు జపనీస్ పిల్లలు మోదీకి భారతీయ భాషల్లో ఘనస్వాగతం పలికి సర్‌ప్రైజ్ ఇచ్చారు.టోక్యోలోని న్యూఒటానీ హోటల్ వద్ద ప్రధాని మోదీ బస చేశారు.ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న జపనీస్ పిల్లలు సందడి చేశారు.

వీరిలో చాలామంది మోదీతో హిందీలో మాట్లాడటంతో ఆయన ఫిదా అయ్యారు.ఈ సందర్భంగా చిన్నారులు తాము వేసిన చిత్రాలను మోడీకి చూపించారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube