వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టులో అట్టడుగున భారత్.. ఎన్నో ర్యాంకంటే..

ఇటీవల వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు( World Happiness Report ) విడుదలైంది.దీనిలో ప్రపంచ దేశాలు వివిధ ప్రమాణాల ఆధారంగా ర్యాంకులు పొందాయి.

 India Is At The Bottom Of The World Happiness Report More Than Many Ranks, World-TeluguStop.com

గతేడాది కంటే భారత్ పరిస్థితి కొంచెం మెరుగు పడినా ఇంకా అట్టడుగునే ఉంది.గతేడాది 136 ర్యాంకు కాగా, ప్రస్తుతం 126 ర్యాంకు దక్కింది.

మరో వైపు ఫిన్లాండ్( Finland ) మరోసారి ప్రపంచంలోని సంతోషకరమైన దేశంగా ఉద్భవించింది.ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ ప్రచురించిన ది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ – 2023లో వరుసగా ఆరవ సంవత్సరంలో ఫిన్లాండ్ అగ్రస్థానంలో ఉంది.

ఈ నివేదిక మార్చి 20 న జరుపుకున్న అంతర్జాతీయ ఆనందం దినోత్సవం సందర్భంగా విడుదల అయింది.

Telugu Finland, Happiest, India, Latest, Happiness-Latest News - Telugu

ప్రపంచ ఆనందం ర్యాంకులో ఫిన్లాండ్ అగ్రస్థానంలో ఉండగా, ఆఫ్ఘనిస్తాన్( Afghanistan ) చివరి స్థానంలో ఉంది.మరోవైపు వరుసగా నాల్గవ సంవత్సరం యూకే హ్యాపీనెస్ స్కోరులో పడిపోయింది.ఈ నివేదికను అనేక మంది ఆర్థికవేత్తలు సంకలనం చేశారు.

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ రిచర్డ్ లెర్డ్, కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్స్( Professor Jeffrey Sachs ) ఇందులో ఉన్నారు.వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ తొలిసారి 10 సంవత్సరాల క్రితం 2012లో విడుదలైంది.

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023 ప్రకారం, 2020-2022లో మూడేళ్ల సగటు ఆధారంగా హ్యాపీనెస్ ర్యాంకింగ్స్‌లో భారతదేశం 126వ స్థానంలో ఉంది.భారతదేశం యొక్క సగటు జీవిత మూల్యాంకన స్కోరు 4.036.మన దేశానికి పొరుగున ఉన్న పాకిస్తాన్ 108వ ర్యాంకు, శ్రీలంక 112వ ర్యాంకు, బంగ్లాదేశ్ 118వ ర్యాంకును పొందాయి.ఈ దేశాల కంటే నేపాల్ మెరుగైన స్థానంలో ఉంది.

Telugu Finland, Happiest, India, Latest, Happiness-Latest News - Telugu

ఆ దేశం 78వ ర్యాంకును సొంతం చేసుకుంది.చైనా 64వ స్థానంలో నిలిచింది.ఇక ఈ జాబితాలో తొలి పది స్థానాలను పొందిన దేశాల జాబితా ఇలా ఉంది.1.ఫిన్లాండ్ (7.804), 2.డెన్మార్క్ (7.586), 3.ఐస్లాండ్ (7.530), 4.ఇజ్రాయెల్ (7.473), 5.నెదర్లాండ్స్ (7.403), 6.స్వీడన్ (7.395), 7.నార్వే (7.315), 8.స్విట్జర్లాండ్ (7.240), 9.లక్సెంబర్గ్ (7.228), 10.న్యూజిలాండ్ (7.123) ఇలా తొలి పది దేశాల జాబితాలో ఇవి చోటు దక్కించుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube