భారత సంతతికి చెందిన నోబెల్ అవార్డ్ గ్రహీత, ప్రఖ్యాత ప్రొఫెసర్ వెంకీ రామకృష్ణన్‌కి యూకే ప్రభుత్వ ప్రతిష్టాత్మక పురస్కారమైన ‘‘రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’’ దక్కింది.సైన్స్‌కి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయనను ఈ అవార్డ్‌కు ఎంపిక చేశారు.
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III ఈ పురస్కారాన్ని వెంకీకి ప్రదానం చేశారు.సాయుధ దళాలు, సైన్స్, కళ, సాహిత్యం, సంస్కృతిని పెంపొందించడం కోసం విశేష కృషి చేసిన వారికి ఆర్డర్ ఆఫ్ మెరిట్ అందించినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనేది బ్రిటీష్ సార్వభౌమాధికారి అందించే ప్రత్యేక గౌరవ చిహ్నం.1902లో కింగ్ ఎడ్వర్డ్ VII దీనిని ప్రారంభించారు.ఏ సమయంలోనైనా దీనిని 24 మందికి మించి ప్రదానం చేయరాదు.
తమిళనాడులోని చిదంబరంలో జన్మించిన వెంకీ రామకృష్ణన్.
ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు.అక్కడ బయాలజీలో చదువుకున్న ఆయన అనంతరం తన మకాంను యూకేకు మార్చారు.
ప్రస్తుతం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రముఖ పరిశోధనా కేంద్రమైన ఎంఆర్‌సీ లాబొరేటరీ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీకి గ్రూప్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు.
రైబోసోమల్ నిర్మాణంపై చేసిన కృషికి గాను వెంకీ 2009లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు.2012లో క్వీన్ విక్టోరియా చేత నైట్ బిరుదును పొందారు రామకృష్ణన్.నవంబర్ 2015 నుంచి నవంబర్ 2020 వరకు యూకే రాయల్ సొసైటీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు.
ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో వెంకీ విదేశీ సభ్యుడిగా వున్నారు.గతంలో ఆయన హిస్టోన్, క్రోమాటిన్ నిర్మాణంపైనా పరిశోధనలు చేశారు.
ఇది కణాలలో డీఎన్ఏ ఎలా ఆర్గనైజ్ అవుతుందో అర్ధం చేసుకోవడానికి సహాయపడుతుంది.