విజయనగరం జిల్లా గుంకలాంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతుంది.దీనిలో భాగంగా ఆయన జగనన్న పేదల కాలనీని పరిశీలించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ప్రజల కోసమే పార్టీ పెట్టామని చెప్పారు.అవినీతికి వైసీపీ కేరాఫ్ అడ్రస్ గా మారిందని విమర్శించారు.
జగన్ ఢిల్లీ వెళ్లి తనపై చాడీలు చెప్తున్నారని ఆరోపించారు.కానీ తాను అలా ఢిల్లీ వెళ్లనని, ఎక్కడి సమస్యను అక్కడే తేలుస్తానని చెప్పారు.
తనను చంపుతామని బెదిరిస్తున్నారన్న ఆయన తన చొక్కా పట్టుకునే దమ్ము వైసీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు.రైతుల కన్నీళ్లు తుడిచే రాజ్యాన్ని జనసేన తీసుకు వస్తుందని తెలిపారు.
వచ్చే జనసేన ప్రభుత్వంలో ఇసుకను ఉచితంగా ఇస్తామన్నారు.చరిత్ర ఉన్న పార్టీలు సైతం జనసేనకు భయపడుతున్నాయని వెల్లడించారు.