Garikapati Narasimharao : చిరంజీవి వివాదం మరవనే లేదు.. అప్పుడే మరో వివాదంలో చిక్కుకున్న గరికపాటి!

గరికపాటి నరసింహారావు ఈమధ్య బాగా వార్తల్లో నిలుస్తున్నాడు.తెలుగు రచయిత, ఉపన్యాసకుడైన గరికపాటి ప్రవచనాలు చెబుతూ ఉంటాడు.

 Ap Women Associations Leaders Fires On Garikapati Narasimharao Details, Controve-TeluguStop.com

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నరసింహారావు.ఉపాధ్యాయునిగా 30 సంవత్సరాలు చేశాడు.

ఆ తర్వాత పలు దేశాలలో, పలు ప్రాంతాలలో పర్యటనలు చేస్తూ అవధనాలు చేస్తూ ఉంటాడు.

అయితే ఈయన చేసే అవధానాలు ఎలా ఉంటాయంటే.

కాస్త వెటకారంగా చేస్తున్నట్లు అనిపిస్తుంది.చాలావరకు కౌంటర్లు వేసే విధంగా ఉంటాయి.

అంతేకాకుండా ఇతరులను ఉద్దేశించి మాట్లాడినట్లు అనిపిస్తూ ఉంటుంది.అయితే మొన్నిమధ్య టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కూడా కాస్త వెటకారం చేస్తూ మాట్లాడిన సంగతి తెలిసిందే.

ఓ సమావేశంలో చిరంజీవి తన అభిమానులతో సెల్ఫీలు దిగుతూ ఉండగా ఆయన కోసం ఎదురు చూస్తున్న గరికపాటి నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేసి చిరంజీవిని అందరి ముందు ఆ ఫోటో సెషన్ ఆపి ఇక్కడికి వస్తే బాగుంటుంది అన్నట్లుగా మాట్లాడాడు.దీంతో అది కాస్త వైరల్ గా మారడంతో వెంటనే చిరంజీవి అభిమానులు గరికపాటి పై ఫైర్ అయ్యారు.

ఇప్పటి కూడా ఈ విషయంలో చిరంజీవి అభిమానులు ఆయన పై ఫైర్ అవుతూ కౌంటర్లు వేస్తూనే ఉన్నారు.చిరంజీవికి క్షమాపణ చెప్పాలి అంటూ బాగా డిమాండ్ కూడా చేశారు.

అయితే ఇది మరవకముందే తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నాడు గరికపాటి.నిజానికి గరికపాటి చెప్పేవి సత్యాలే అయినప్పటికీ ఆయన చెప్పే విధానం మాత్రం వెటకారంగా ఉంటుంది.

ఇతరులను కించపరిచే విధంగా ఉంటుంది.దీంతో ఆయనపై బాగా విమర్శలు తలెత్తుతుంటాయి.అయితే ఇటీవలే గరికపాటి ఆడవాళ్ళ వస్త్రధారణపై, అంతేకాకుండా వారి మేకప్ ల గురించి, వారి శరీరాలపై కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.దీంతో ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని మహిళా సంఘాలు ఆయనపై ఫైర్ అవుతూ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

దీంతో దానికి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో బాగా వైరల్ గా మారింది.ఇక ఆ వీడియోలో కొందరు మహిళలు ఆయన పట్ల ఫైర్ అవుతూ బాగా విమర్శలు చేశారు.

ఆయన బుద్ధులు చాలా అసహ్యంగా ఉన్నాయి అంటూ.అయినా ఆడవాళ్ళ గురించి మాట్లాడే విధానం బట్టి ఆయన బుద్ధి ఏంటో అర్థం అవుతుంది అని అన్నారు.

ఆడవాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఆయనలేదు అంటూ.ఆడవాళ్లు స్వతంత్రంగా బతకడం తప్పా అని.ఇక ఆడవాళ్ళు వంటింటి కుందేలుగా బతకడమే కావాలా అంటూ బాగా విమర్శించారు.ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు అంటూ ఆడవాళ్లు ఏ బట్టలు వేసుకుంటే నీకెందుకు అంటూ.

నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

ప్రవచనాలు అనే ముసుగులో ఆడవాళ్లను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అంటూ.

మీకు పద్మశ్రీ అవార్డు ఎవరిచ్చారు.అంటూ నానా రకాలుగా అయిన పై ఫైర్ అవుతున్నారు మహిళలు.

ఇక ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవ్వడంతో.కొందరు గరికపాటి కు సపోర్టివ్ గా మాట్లాడుతుంటే మరికొందరి నెగెటివ్ గా కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube