నందిగామ తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా గత ఐదురోజులుగా ఎడ్ల బండ లాగుడు పోటీలు జరుగుతున్నాయి.ఈరోజు చివరి రోజు కావడంతో టిడిపి నేతలు మాజీ ఎమ్మెల్యేలు, బోండా ఉమా, దేవినేని ఉమా, కేశినేని చిన్ని, పట్టాభి, శ్రీరాం తాతయ్య లు పొల్గోని విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై టిడిపి నేతలు విమర్శలు గుప్పించారు.నందిగామ నియోజకవర్గ లో అన్న ఒకపక్క తమ్ముడు ఒక పక్క ఇసుకను దోచుకుంటున్నారు.
నియోజకవర్గ లో ఉన్న ఇసుకను హైదరాబాద్ తరలించి సోమ్ము చేసుకుంటున్నారు ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ అన్నదమ్ములు బోండా ఉమా నియోజకవర్గం లో జరుగుతున్న అవినీతి ని ప్రజలు గమనిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో లో టీడీపీ కంచుకోట నందిగామ మళ్ళీ టీడీపీ జెండా ఎగురవేస్తాం.నందిగామ కు వచ్చిన చంద్రబాబుకు ప్రజలు చూపిన ఆదరణే రాష్ట్రం అంతా అదే ఆదరణ కోనసాగుతోంది.
టీడీపీ అధినేత కు చూపిన ఆదరణే రేపు టీడీపీ అధికారంలోకి రావడానికి పునాది అన్న కేశినేని చిన్ని.
టీడీపీ నేత పట్టాభి పాయింట్స్ :సైకో స్టార్ రాష్ట్రం లో అన్ని రకాలుగా పట్టి పిడిస్తున్న సైకో స్టార్ ను ఒంగోలు గిత్త అవతారం ఎత్తి కుమ్మి పడేయాలి: టీడీపీ నేత పట్టాభి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ తట్టుకోలేక మాచర్ల వంటి ఘటనలకు పాల్పడుతున్నారు.సైకో స్టార్ నాయకత్వం లో పనిచేసే సైకో గాళ్ళు టీడీపీ నేతలపై తెగబడుతున్నారు సైకో స్టార్ ను టీడీపీ ప్రతి కార్యకర్త కుమ్మడానికి సిద్దం గా ఉన్నారు.ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడటం చేతకాక పోతే పెట్టే బేడా సర్దుకోని తాడేపల్లి ఖాళీ చేసి వెళ్ళిపొ టీడీపీ నేతల ఓర్పును బలహీనత అనుకోవద్దు .