ఏపీలో రౌడీలు, సైకోలు స్వైర విహారం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు చేశారు.గన్నవరంలో ధ్వంసమైన టీడీపీ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ప్లాన్ ప్రకారమే వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు.అందులో భాగంగానే తమ పార్టీ కార్యాలయంలో కంప్యూటర్లు, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారని తెలిపారు.
వైసీపీ నాయకులు బరి తెగించి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.పోలీసుల వింత చేష్టలు అర్థం కావడం లేదని విమర్శించారు.
తమపై దాడి చేసి తిరిగి తమపైనే కేసులు పెట్టారన్నారు.బెదిరిస్తే భయపడే పార్టీ తమది కాదని వెల్లడించారు.