తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా బ్రిటీష్ రూల్సే అమలు అవుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.స్వరాష్ట్రంలో ఐటీడీఏ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఆరోపించారు.
మిషన్ భగీరథ అతిపెద్ద స్కామ్ అని భట్టి విమర్శలు గుప్పించారు.టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలన్నారు.
అకాల వర్షంతో నష్టపోయిన రైతులను సర్కార్ ఆదుకోవాలని కోరారు.కవిత, కేజ్రీవాల్ సహా లిక్కర్ స్కాంలో ఉన్న వాళ్లంతా శిక్షార్హులేలని భట్టి వెల్లడించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని ప్రక్షాళన చేస్తామని తెలిపారు.