ఆ భయం వల్లే నేను ఎంతో ఉత్తమంగా పనిచేస్తున్నా... రాజమౌళి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం ద్వారా దర్శకుడిగా తన కెరియర్ ప్రారంభించి అపజయమెరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి నేడు పాన్ ఇండియా స్థాయిలో చిత్రాలను తెరకెక్కించే స్థాయికి ఎదిగారు.

 Im Doing Very Well Because Of That Fear Rajamouli Comments Viral, Rajamouli, Tol-TeluguStop.com

ఈ క్రమంలోనే చరిత్రలో ఎప్పుడు కలవాలి ఇద్దరు యోధులను కలుపుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.

ఈ క్రమంలోనే చిత్ర బృందం ఈ సినిమాని మార్చి 25 వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు రాజమౌళి గల్ఫ్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Telugu Rajamouli, Tollywood-Movie

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఎదగడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని తెలియజేశారు.జీవితంలో ఓటమి భయమే తనని ఓ పెద్ద కల కనే విధంగా చేస్తుందని, నేను ఎప్పుడు ఏ సినిమా చేసినా ముందు సినిమా కన్నా గొప్పగా ఉండాలని భావిస్తాను.అందుకే నా సినిమాలో మ్యాజిక్ సృష్టించాలనే భయం నాలో ఎప్పుడూ ఉంటుంది.

ఆ భయం వల్ల నేను ఇండస్ట్రీలో సక్సెస్ అవుతున్నాను అలాగే ఎంతో ఉత్తమంగా పని చేయగలుగుతున్నాను అంటూ రాజమౌళి ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube