డబ్ల్యూటీసీ టైటిల్ గెలిస్తే.. క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించిన జట్టుగా భారత్..!

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ( World Test Championship )ఫైనల్ మ్యాచ్ భారత్ – ఆస్ట్రేలియా( India – Australia ) మధ్య జరగనున్న సంగతి తెలిసిందే.జూన్ 7 నుంచి జూన్ 11 వరకు ది ఓవల్ లో ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

 If They Win The Wtc Title India Will Become A Team That Has Created A New Histor-TeluguStop.com

భారత జట్టు వరుసగా రెండవసారి డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరింది.ఈ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు గెలిస్తే క్రికెట్ ప్రపంచంలోనే సరికొత్త చరిత్ర సృష్టించిన జట్టుగా భారత్ అవతరించనుంది.2013 లో ధోని( Dhoni ) సారథ్యంలో భారత జట్టు ఐసీసీ ట్రోఫీ గెలిచింది.ఆ తర్వాత ఇప్పటిదాకా మరో ఐసీసీ ట్రోఫీ భారత్ గెలవలేదు.

Telugu Dhoni, India Australia, Latest Telugu, Rohit Sharma, Championship, Wtc-Sp

1984లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత జట్టు తొలిసారి వన్డే ప్రపంచ కప్ గెలిచింది.ఆ తరువాత 23 ఏళ్లకు ధోని సారథ్యంలో 2007లో తొలిసారి టీ 20 వరల్డ్ కప్ గెలిచింది.ఇక 2011లో ధోనీ సారథ్యంలో మళ్లీ వన్డే ప్రపంచ కప్ గెలిచింది.అంటే భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్లో వన్డే, టీ 20 ఫార్మాట్లలో మాత్రమే ప్రపంచకప్ గెలిచింది.

తాజాగా జరగనున్న టెస్ట్ ఫార్మాట్ లో గెలిస్తే.మూడు ఫార్మాట్లలో ప్రపంచ కప్ గెలిచిన తొలి జట్టుగా సరికొత్త రికార్డు సృష్టించబడుతుంది.

Telugu Dhoni, India Australia, Latest Telugu, Rohit Sharma, Championship, Wtc-Sp

అయితే ఆస్ట్రేలియా ఈ డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలిస్తే ఆస్ట్రేలియా కూడా మూడు ఫార్మాట్లలో ప్రపంచ కప్ గెలిచిన తొలి జట్టుగా సరికొత్త రికార్డు సృష్టిస్తుంది.కాబట్టి ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్లకు ఎంతో కీలకం.ఈ ఫైనల్ మ్యాచ్లో గెలిచేందుకు ఇరుజట్లు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నాయి.ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కు భారత జట్టు ప్లేయర్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కే.ఎస్ భరత్, శార్దూల్ ఠాగూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.సబ్ స్టిట్యూట్స్: సూర్య కుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, ముఖేష్ కుమార్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube