ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే పుష్ప ది రైజ్( Pushpa The Rise ) సినిమాకు ముందు పుష్ప ది రైజ్ సినిమా తర్వాత అంటూ మాట్లాడుకోవాలి.పుష్ప సినిమాతో బన్నీ ఒకేసారి ఎన్నో మెట్లు పైకి ఎక్కేశారు.
సోషల్ మీడియా ప్రమోషన్స్ సైతం బన్నీ కెరీర్ కు ఒక విధంగా ప్లస్ అవుతున్నాయనే చెప్పాలి.అయితే బన్నీ బ్రాండ్ వాల్యూ పదిరెట్లు పెరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఒకప్పుడు బన్నీ బ్రాండ్ వాల్యూ( Allu Arjun Brand Value ) రోజుకు 60 లక్షల రూపాయలుగా ఉంటే ఇప్పుడు 6 కోట్ల రూపాయలుగా ఉంది.ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఇది కదా బన్నీ రేంజ్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
బన్నీ స్వయంకృషితో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారని బన్నీ సక్సెస్ గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువేనని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
బన్నీ సినిమాలలో డైలాగ్స్ కూడా ప్రత్యేకంగా ఉంటున్నాయి.వరుసగా నాన్ బాహుబలి హిట్లను సొంతం చేసుకుంటున్న అల్లు అర్జున్ పుష్ప ది రూల్ తో( Pushpa The Rule ) సైతం అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తారేమో చూడాలి.అల్లు అర్జున్ కెరీర్ పరంగా ఎంత ఎదిగినా సింపుల్ గా ఉంటూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతూ ఉండటం గమనార్హం.
బన్నీ వరుసగా యాడ్స్ లో నటిస్తుండటంతో బుల్లితెరపై బన్నీ హవా కొనసాగుతోంది.
బన్నీ రాజమౌళి( Rajamouli ) డైరెక్షన్ లో, ప్రశాంత్ నీల్( Prasanth Neel ) డైరెక్షన్ లో నటించినా లేదా మరో రెండు ఇండస్ట్రీ హిట్లను సాధించినా అల్లు అర్జున్ మార్కెట్ ఏ రేంజ్ లో పెరుగుతుందో కూడా అంచనా వేయలేమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.బన్నీ రేంజ్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.