టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు తన 39వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున సెలబ్రిటీలు అభిమానులు ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇకపోతే ఎన్టీఆర్ అభిమానులు పలు చోట్ల ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ తన అభిమాన హీరో పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్టీఆర్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా నేడు తారక్ పుట్టిన రోజు జరుపుకోవడంతో ఆయనతో పాటు పనిచేసిన దర్శకులు కూడా పెద్దఎత్తున సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రముఖ డైరెక్టర్ శ్రీను వైట్ల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ గురించి ఎమోషనల్ పోస్ట్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు.
హ్యాపీ బర్త్ డే మై డియర్ బాద్ షా.నిన్ను చూడాలని మొదటి రోజు షూటింగ్ నుంచి యంగ్ టైగర్ ప్రస్తుతం పాన్ ఇండియా టైగర్ అయ్యేవరకు మీ అద్భుతమైన ఎదుగుదలకు నేనే ప్రత్యక్ష సాక్షి.పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన RRR సినిమాలో మీ నటన ఎంతో అద్భుతం.ముఖ్యంగా కొమరం భీముడో పాటలో నీ నటన చూసిన ఆ క్షణం కన్నీళ్లాగలేదు.
ఇలా మీరు మరెన్నో విజయాలను అందుకుని మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా అంటూ తారక్ కి శ్రీనువైట్ల పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు.