ఫోన్ కాల్. ఇప్పుడు అందరిని అక్కడ భయపెట్టిస్తోంది, ఫోన్ మాట్లాడాలంటేనే ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్దితి, ఇదేదో ఒకరిద్దిరికి వచ్చిన సమస్యకాదు అధికారులు రాజకీయ నాయకులు ఇలా ఎవరైనా కిందిస్దాయి నుండి పైస్థాయి వరకు అందరికి అదే ఫివర్.
కొత్త నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందంటే చాలూ మాట్లాడాలంటే ఆచూ తూచి మాట్లాడుతున్నారు.కాంటాక్ట్ లిస్టులోని నెంబర్ల నుండి ఫోన్ వచ్చినా నమ్మె పరిస్థితి లేకుండా పోయింది.అందుకు కారణం ఇటీవలి కాలంలో ఎదుటి వారికి తెలియకుండా వారితో ఫోన్ మాట్లాడుతూ కాల్ రికార్డ్ చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడమే.
మీకు కూడా ఎవరైనా మీ కాల్ రికార్డ్ చేస్తున్నారని అనుమానం వస్తే ఈ ట్రిక్స్ తో కనిపెట్టేయండి
డిఫాల్ట్ ఫీచర్‌ని ఉపయోగించి కాల్‌ను రికార్డ్ చేస్తున్నప్పుడు, ఆండ్రాయిడ్ ఫోన్‌లలో బీప్ శబ్ధం మనకు వినిపిస్తుంది.కాబట్టి, కాల్ సమయంలో బీప్ మళ్లీ మళ్లీ వినిపించినప్పుడు, మీ కాల్ రికార్డు చేయబడుతుందని అర్థం.ఎదుటి వ్యక్తి మీ ఫోన్ లిఫ్ట్ చేయగా.బీప్ శబ్దం వినిపిస్తే.అది కాల్ రికార్డింగ్‌కు సూచన.
అలా బీప్ వినిపిస్తే కాల్ రికార్డ్ చేయబడుతుందని భావించవచ్చు.
కొన్ని ఫోన్లలో రికార్డ్ ఆప్షన్ పెట్టుకుంటే ఎదుటు వారు ఫోన్ లిఫ్ట్ చేయగానే మీ కాల్ రికార్డ్ చేయబడుతుంది అని వాయిస్ మెసేజ్ వారికి వినిపిస్తుంది.మీకు అలా వినిపస్తే అలర్ట్ అవ్వండి.చాలా ఫోన్‌లలో డిఫాల్ట్ రికార్డింగ్ ఆప్షన్ లేదు.
అందుకని కొంతమంది ఫోన్‌ని స్పీకర్‌లో ఉంచి మాట్లాడతారు మరియు మరొక ఫోన్‌లో రికార్డర్‌ను ఆన్ చేస్తారు.అటువంటి పరిస్థితిలో, సంభాషణ సమయంలో, ముందు స్పీకర్ మాట్లాడుతున్నారా లేదా అని గమనించండి.
స్పీకర్‌తో మాట్లాడేటప్పుడు రీ సౌండ్ వస్తుంది.మీకు అలా జరిగితే అలర్ట్ అవ్వండి.
ఫోన్ మాట్లాడే సమయంలో ఫోన్ స్క్రీన్‌పై కూడా శ్రద్ధ వహించాలి.మీరు ఎలాంటి ఆప్షన్ ఎంచుకోకుండా నోటిఫికేషన్ బార్‌లో మైక్ ఐకాన్ ఉంటే, ఎవరైనా మీ ఫోన్ ను హ్యాక్ చేస్తున్నట్లు గుర్తించి అలర్ట్ అవ్వాలి.
అలా జరిగితే మీ ఫోన్ ప్రతీ కాల్ వారు వింటున్నారని అర్థం చేసుకోండి.