జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టానన్న జనసేనాని ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామని తెలిపారు.
జనసేనలో చేరేందుకు చాలా మంది వస్తున్నారన్న పవన్ కల్యాణ్ తాను మాటల్లో చెప్పనని, నిలబడి చూపిస్తానని పేర్కొన్నారు.అణగారిన వర్గాలకు నిర్ణయాత్మక శక్తి ఉండాలని పవన్ తెలిపారు.విధానాలు రూపొందించే అధికారం కావాలన్నారు.2024లో టీడీపీ -జనసేన అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.సీఎం జగన్ పై తనకు వ్యక్తిగత ద్వేషం లేదని స్పష్టం చేశారు.
.