ఆయనకు టికెట్ ప్రకటించేసిన నాని ! గందరగోళంలో టీడీపీ !

చాలా కాలంగా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, తలనొప్పిగా మారారు విజయవాడ టిడిపి ఎంపీ కేసీనేని నాని( MP Ksineni Nani ).పార్టీ అధిష్టానం సూచనలను పక్కనపెట్టి సొంతంగా నిర్ణయాలను ప్రకటిస్తూ పార్టీలో గందరగోళం సృష్టిస్తున్నారు.

 I Announced The Ticket To Him! Tdp In Nani , Tdp, Chandrababu, Jagan, Ysrcp, Ke-TeluguStop.com

చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సొంతంగా ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్న కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా ఎటువైపు అడుగులు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది.అయితే ప్రస్తుతం టిడిపిని గద్దె దించే విధంగా ప్రకటనలు చేస్తూ,  పార్టీ క్యాడర్ ను గందరగోళానికి గురి చేస్తున్నారు.

టిడిపి సిట్టింగ్ ఎంపీగా తాను ఉన్నా , తనకు బదులుగా తన సోదరుడు కేశినేని చిన్నిని( Kesineni Chinni ) టిడిపి అధిష్టానం వచ్చే ఎన్నికల్లో టిడిపి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్ధమవుతుండడంతో , నాని మరింతగా ఆగ్రహంతో ఉన్నారు.

Telugu Chandrababu, Jagan, Kesineni Chinni, Kesineni Nani, Vijayawada Mp, Ysrcp-

ఈ క్రమంలోనే సొంత పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా అనేక ప్రకటనలు చేస్తున్నారు.పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.ఇటీవల టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) చేపట్టిన యువ గళం పాదయాత్రకు నాని దూరంగానే ఉన్నారు.

ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లను నాని ప్రకటిస్తుండడం , టిడిపి అధిష్టానానికి తలనొప్పిగా మారింది.అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాని పై నేరుగా చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉండడంతో,  ఆయన విషయంలో ఏం చేయాలనేది ఆ పార్టీ అధిష్టానానికి అంతు పట్టడం లేదు.

అసలు నాని వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఏ సీటులో పోటీ చేస్తారు అనేది తెలియక టిడిపి క్యాడర్ అయోమయానికి గురవుతోంది.ఇక చాలా కాలంగా విజయవాడ టిడిపి నేతలతో నాని దూరంగా ఉంటున్నారు.

Telugu Chandrababu, Jagan, Kesineni Chinni, Kesineni Nani, Vijayawada Mp, Ysrcp-

టిడిపి సీనియర్ నేత బుద్ధ వెంకన్న, బోండా ఉమ( Buddha Venkanna, Bonda Uma ) వంటి వారితోనూ అదే దూరం పాటిస్తున్నారు.ఇక వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బుద్ధ వెంకన్న పోటీ చేయాలని చూస్తున్నారు.ఇప్పటికే ఆ నియోజకవర్గం పై పూర్తిగా ఫోకస్ పెట్టి అక్కడి పార్టీ క్యాడర్ తో సన్నిహితంగా మెలుగుతూ, ఆ నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.దీంతో వెంకన్నకు చెక్ పెట్టేందుకు నాని రంగంలోకి దిగారు.

తన అనుచరుడు ఎమ్మెస్ బేగ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని నాని ప్రకటించేశారు.ఎంపీగా తాను ఎమ్మెల్యేగా పోటీలో ఉంటామని ప్రకటించడంతో,  ఆ ప్రకటనను ఖండించాలా వద్దా అనే  అంతర్మథనంలో పార్టీ నాయకులు ఉన్నారు.

  ఇక టిడిపి అధిష్టానం పరిస్థితి కూడా అదే విధంగా ఉంది .ఇప్పుడున్న పరిస్థితుల్లో నాని పై చర్యలు తీసుకుంటే జరిగే నష్టమే ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన వ్యవహారాన్ని చూసి చూడనట్లుగా వదిలేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube