హైదరాబాద్ కు చెందిన ఆదిత్ విశ్వనాథ్ గౌరిశెట్టి అనే 2 ఏళ్ల బాబు తన తెలివితేటలతో అందరిని ఆకట్టుకుంటున్నాడు.అతని వయసు కేవలం 1 సం 9 నెలలు మాత్రమే.
ఈ వయసులోనే అతడు మేధావిగా పేరుపొంది 5 రికార్డ్ లను సాధించాడు.తన మేధా శక్తి తో వరల్డ్ బుక్ లో రికార్డ్స్ మరియు ఇతర నాలుగు అవార్డ్ లను పొందాడు.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఇతర 2 రికార్డ్ లు సొంతం చేసుకున్నాడు.ఆదిత్ కు ఉన్న ప్రతిభ వల్ల అతను చుట్టుపక్కల మాత్రమే కాకుండా ఇతర ప్రదేశాల్లో కూడా ఫేమస్ అయ్యాడు.
అతని వయసున్న ఇతర పిల్లలు నర్సరీ రైమ్స్ చదువుతూ ఉండగా, అతను మాత్రం ఇప్పటికే కార్ లోగోను, కలర్స్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, బాడీ పార్ట్స్, డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్, ఫ్లాగ్స్, ఫ్రూట్స్, హోమ్ అప్లయెన్సెస్ అన్నిటిని గుర్తుపడుతున్నాడు అని హైదరాబాద్ వరల్డ్ రికార్డ్ ప్రోడిజి తెలిపింది.మొత్తానికి మన హైదరాబాద్ పిల్లవాడు ఫేమస్ అవడం చూసి చాలా మంది సంతోషపడుతున్నారు.