పెయిడ్ ప్రీమియర్ కోసం రాధేశ్యామ్ పై ఒత్తిడి తెస్తున్న ఫ్యాన్స్.. వారి నిర్ణయం ఏంటో?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.వాటిల్లో రాధేశ్యామ్ ఒకటి.

 Huge Demand For Prabhas Radheshyam Paid Premiere Details, Prabhas,radheshyam,pai-TeluguStop.com

రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.ప్రభాస్ ను వెండి తెర మీద చూడక దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది.

అందుకే రాధేశ్యామ్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఈ సినిమా మార్చి 11న రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రమోషన్స్ పరంగా వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత దగ్గర చేసింది.దీంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ మరీ పెరిగి పోయింది.

ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇక మరీ కొద్దీ గంటల్లోనే ఈ సినిమా రిలీజ్ ఉండడంతో ఫ్యాన్స్ నుండి రాధేశ్యామ్ టీమ్ కు తీవ్ర ఒత్తిడి ఎదురు అవుతుందట.

ఈ సినిమా మార్చి 11 న రిలీజ్ అవుతున్నప్పటికీ 10వ తేదీ సాయంత్రం నుండే పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని డార్లింగ్ అభిమానులు మేకర్స్ ను డిమాండ్ చేస్తున్నారు.ప్రభాస్ ను చూడక చాలా ఏళ్ళు అవుతున్న కారణంగా ఆ మాత్రం ఎక్సయిట్ మెంట్ ఉంటుంది.

Telugu Radha Krishna, Paid Premiere, Pan India, Pooja Hegde, Prabhas, Prabhas Fa

అయితే మేకర్స్ కూడా వారి అభిమానుల కోరిక మేరకు ప్రభుత్వం తో అనుమతి తీసుకుని పెయిడ్ ప్రీమియర్ వేసే అవకాశం ఉంది.ఇది వీరికి కూడా లాభమే.రిలీజ్ కు ముందే భారీ కలెక్షన్స్ రాబడుతుంది.ఈ సినిమాను డైరెక్టర్ పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించాడు.ఇందులో రొమాన్స్ కూడా బాగానే ఉందని చిత్ర యూనిట్ చెబుతున్న మాట.ఇది లవ్ స్టోరీ కావడంతో ఈ సినిమాకు ప్రీమియర్ వేస్తె టాక్ ముందుగానే బయటకు వస్తుంది.అదే జరిగితే సినిమా హిట్ అయితే ప్లస్ అవుతుంది కానీ ప్లాప్ టాక్ వస్తే తర్వాత కలెక్షన్స్ మీద తీవ్ర ప్రభావం ఉంటుంది.అందుకే ప్రీమియర్ వేయకపోవచ్చని కూడా మరో మాట బయటకు వస్తుంది.

మరి ఫ్యాన్స్ కోరిక మేరకు పెయిడ్ ప్రీమియర్ వేస్తారో లేదంటే డైరెక్ట్ రిలీజ్ చేస్తారో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube