స్మార్ట్ ఫోన్ లేని మనిషే ఈ భూమిమీద ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో.ఒకప్పుడు కంప్యూటర్ లేనిదో కొన్ని పనులు జరిగేవి కాదు.
కానీ నేడు పరిస్థితి మారింది.స్మార్ట్ ఫోన్ అనేది అందుబాటులోకి వచ్చాక చాలా పనులు చాలా తేలికగా మారాయి.
అందులో ఫోటోగ్రఫీ ముఖ్యమైనది.ఫోటోలు తీసుకోవడానికి కొన్నాళ్ల క్రితం వరకు స్టూడియోలకు వెళ్లేవారు.అయితే స్మార్ట్ ఫోన్ నేడు దానిని పూర్తిగా మార్చివేసింది.స్మార్ట్ ఫోన్లో మనం ఎంతో అందంగా తీసుకున్న ఫొటోలను ముద్రించుకోవాలంటే కలర్ ల్యాబ్లకు వెళ్లాల్సిన పనిలేదు.
అంత శ్రమ లేకుండా చాలా త్వరితగతిన ఫొటోలు ముద్రించగల ఫొటో ప్రింటర్ ని కంప్యూటర్ల తయారీ సంస్థ అయినటువంటి హ్యూలెట్ పాకార్డ్ ‘హెచ్పీ’ తాజాగా మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది.దీనిని స్మార్ట్ ఫోన్లోని యాప్ కి లింక్ చేసుకుంటే సరిపోతుంది.
‘హెచ్పీ స్క్రాకెట్ స్టూడియో ప్లస్’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ఫొటో ప్రింటర్ ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్ల ద్వారా తేలికగా యూస్ చేయొచ్చు.అవును, డౌన్లోడ్ చేసుకున్న యాప్ ద్వారా క్షణాల్లోనే కోరుకున్న ఫొటోలను ముద్రించుకోవచ్చు.
అయితే ఇక్కడ ఓ నిబంధన వుంది.దీని ద్వారా కేవలం 6 ” 4 అంగుళాల సైజులో మాత్రమే ఫొటోలను ముద్రించుకునే అవకాశం కలదు.కాగా దీని ధర 149.99 డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో రూ.12,374 మాత్రమే అని చెబుతున్నారు కంపెనీ నిర్వాహకులు.అదే విధంగా 6 ” 4 అంగుళాల సైజులో మీకు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు కూడా వస్తాయి.
కాబట్టి దీనిని ఆదాయ వనరుగా కూడా మార్చుకొనే వీలుందని నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా దీనిని మీరు ఎక్కడికి పడితే అక్కడికి తీసుకుపోయే వెసులుబాటు కలదు.ఎందుకంటే ఇది చూడటానికి చిన్న సైజులో ఉంటుంది కాబట్టి.