ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ చాలా ఏళ్ళ క్రితం జరిగింది.ముంబైలో( Mumbai ) ఒక చిన్న హోటల్ ఉండేది.
అందులో భోజనం చేయడానికి ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు.చాలా ఆకలి మీద ఉన్నాడేమో తిండి మొహం కూడా చూసి ఎన్ని రోజులైందో తెలియదు అనే విధంగా కనిపిస్తున్నాడు.
అనేక ఆహార పదార్థాలు వెయిటర్ తో చెప్పి తెప్పించుకొని విపరీతంగా తినేస్తున్నాడు.కడుపు పూర్తిగా నిండిపోయిన తర్వాత వెయిటర్ బిల్లు తీసుకొచ్చి అతని ముందు పెట్టాడు.
దాన్ని పట్టుకొని సరాసరి కౌంటర్ మీద కూర్చున్న సేటు దగ్గరికి వెళ్ళాడు.అతడితో ఈ విధంగా చెబుతున్నాడు.
సేటు ఒక రూపాయి కూడా నా దగ్గర లేదు.నేను తిండి తిని రెండు రోజులకు పైగానే అయింది.ఇలాగే తినకుండా ఉంటే చచ్చిపోతానేమో అనే భయం వేసింది.అందుకే డబ్బు లేకపోయినా వచ్చి నీ హోటల్లో( Hotel ) భోజనం చేశాను.
ఈరోజుకు నా ప్రాణాలు నిలిచాయి.కానీ నీకు ఇవ్వాల్సిన డబ్బు బాకీ కింద రాసుకో.
ఏదైనా పని చెప్పు నేను తిన్నదానికి చేసి పెడతాను.ఈ బాకీ ని నువ్వు ఖాతా కింద రాసుకో.
నీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వచ్చి చెల్లిస్తాను.అలా చేస్తేనే నాకు నీకు ఇద్దరికీ గౌరవం అని చెబుతున్నాడు.
ఈరోజు ఇలా వదిలేస్తే మళ్లీ కనిపిస్తాడో లేదో కానీ అతడి పరిస్థితిని చూసి సదరు సేటు పరవాలేదు వెళ్లిపో అని చెప్పాడు.వెయిటర్( Waiter ) అలా ఎలా వదిలేశారు సార్ అంటూ ప్రశ్నించిన పర్వాలేదు పోరా వెళ్లి నీ పని చేసుకో అని అన్నాడు కానీ ఆ వ్యక్తిని డబ్బు ఇచ్చి వెళ్ళమని కోపం చూపించలేదు.అలాగని ఒక దెబ్బ కూడా వేయలేదు.అలా జరిగి ఉంటే ఈ రోజు మనం ఇలా మాట్లాడుకునే వాళ్ళం కూడా కాదు.సరిగ్గా ఈ సంఘటన జరిగిన ఒక మూడు నాలుగు నెలల తర్వాత ఆ వ్యక్తి హోటల్ కి వచ్చి తను తిన్న దానికి బాకీ చెల్లించి సేటుకు కృతజ్ఞతలు చెప్పాడు.
ప్రస్తుతం తనకు సినిమాల్లో నటించడానికి అనేక అవకాశాలు వస్తున్నాయని చెప్పడంతో అచ్చి బాత్ హే అంటూ సదరు సేటు కూడా మెచ్చుకొని చాయ్ తెప్పించాడు.సరదాగా అప్పటి నుంచి ఆ హోటల్ కి వెళ్లడం చాయ్ తాగడం ముచ్చట్లు పెట్టుకోవడం అలా దోస్తీ పెంచుకున్నారు.అలా సినిమాల్లో నటిస్తూనే సదరు వ్యక్తి బంగాళా కొన్నాడు.
మంచి కారు కొనుక్కున్నాడు.దానికి డ్రైవర్ ని పెట్టుకున్నాడు.
కాలం అలా వెళ్ళిపోతూనే ఉంది.ఆ మనిషి ఆ హోటల్ కి తరచుగా వస్తూనే ఉన్నాడు సేటుతో కాసేపు మాట్లాడి వెళ్లిపోవడం అనేది అతనికి చాలా కాలక్షేపం.
ఆరోజు బిల్లు కట్టలేదని కోపంతో ఒక దెబ్బ సేటు వేసి ఉంటే మనకు ఓం ప్రకాష్( Actor Om Prakash ) అనే ఒక గొప్ప నటుడు దొరికేవాడు కాదు.కానీ అతడు డెస్టినీలో మరొకటి రాసింది కాబట్టి ఇలా జరిగింది. ఓం ప్రకాష్ 1919లో కాశ్మీర్లో పుట్టాడు.1998లో 78 ఏళ్ల వయసులో మరణించాడు.అమితాబ్( Amitabh Bachchan ) అన్ని సినిమాల్లోనూ అతడు కనిపిస్తాడు.నమక్ హలాల్ సినిమా( Namak Halaal ) ద్వారా ఓం ప్రకాష్ అందరికీ గుర్తుండిపోయాడు
.