బంతిపూలకు ( Marigold Flower )మార్కెట్లో ఎప్పుడు మంచి ధరనే ఉంటుంది.ఎందుకంటే.
పండగలు వచ్చిన, శుభకార్యాలు వచ్చిన బంతిపూలు కావాల్సిందే.కాబట్టి బంతిపూలను సాగు చేసే రైతులు కొన్ని మెళుకువలు పాటించి సాగు చేస్తే ఆశించిన స్థాయిలో దిగుబడులను పొందవచ్చు.
బంతిపూలు వివిధ రంగుల్లో ఉండడంవల్ల ఇంట్లో జరిగే ప్రతి కార్యానికి బంతిపూలను ఉపయోగిస్తారు.బంతిపూలను ఏడాది పొడవునా సాగు చేయవచ్చు.కాబట్టి బంతిపూల సాగు విస్తీర్ణం ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది
ఈ బంతి పంట( Marigold Flower Cultivation ) కాలం నాలుగు నెలలు.అయితే నాటిన 55 రోజుల తర్వాత పూల దిగుబడి రావడం ప్రారంభమై సుమారుగా మూడు నెలల పాటు దిగుబడి వస్తూనే ఉంటుంది.సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఒక ఎకరం పొలంలో దాదాపుగా 80 నుంచి 100 క్వింటాళ్ల పూల దిగుబడి పొందవచ్చు.
బంతిపూల రకాలలో ఆఫ్రికన్ ఫ్రెంచ్ బంతిపూల సాగు వల్ల అధిక దిగుబడులు( High yields ) సాధించవచ్చు.ఒక ఎకరాకు దాదాపుగా 500 గ్రాముల విత్తనాలు అవసరం.ఇక మొక్కల మధ్య మొక్కల వరుసల మధ్య రెండు అడుగుల దూరం ఉండేటట్లు నాటుకోవాలి.
మొక్కకు సూర్యరశ్మి, గాలి బాగా తగిలి ఆరోగ్యకరంగా పెరిగితే ఒక్కో మొక్క నుంచి దాదాపుగా 150 పూలు పొందవచ్చు.బంతిపూలకు ఆశించే చీడపీడల విషయానికి వస్తే.పిండి నల్లి గంగోలి పురుగులు, తామర పురుగులు, నల్లి పురుగులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ ఎప్పుడు అయితే ఈ చీడపీడలు పంటను ఆశిస్తాయో అప్పుడు వెంటనే ఒక మిల్లీమీటర్ పాస్పామెడన్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఒకవేళ చీడపీడల( Pests ) ఉధృతి ఎక్కువగా ఉంటే.ఫిప్రోనిల్, పర్ఫ్ లలో ఏదో ఒక దానిని పిచికారి చేసి పంటను సంరక్షించుకుంటే ఆశించిన స్థాయిలో దిగుబడి పొందవచ్చు.